News September 24, 2025

PUలో ఘనంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలు

image

పాలమూరు యూనివర్సిటీలోని ఆడిటోరియంలో NSS-2025(జాతీయ సేవా పథకం) దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ ఉపకులపతి(VC) జిఎన్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఎన్ఎస్ఎస్ వాలంటరీలతో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, NSS సేవలు అద్భుతంగా ఉన్నాయన్నారు. రిజిస్ట్రార్ రమేష్ బాబు, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ కే.ప్రవీణ, అధ్యాపకులు, వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 24, 2025

జడ్చర్ల: ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన కలెక్టర్

image

జడ్చర్ల మండలంలోని మల్లెబోయినపల్లి, మాచారం గ్రామాలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి, ఇప్పటివరకు జరిగిన పనుల స్థితి, దశల వారీగా బిల్లుల చెల్లింపుల గురించి ఆరా తీశారు. కలెక్టర్ సంబంధిత అధికారులకు పనులను వేగంగా పూర్తి చేయాలని, లబ్ధిదారులు ఇళ్లు త్వరగా నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు .

News September 24, 2025

సీసీ కుంట: అక్టోబర్ 22 నుంచి కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు

image

అక్టోబర్ 22 నుండి శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి ఆవిష్కరించారు. MLA మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు.

News September 24, 2025

PU.. సౌత్ జోన్ ఆర్చరి జట్టు ఎంపిక

image

పాలమూరు యూనివర్సిటీలో ఆర్చరి పురుషుల విభాగంలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు బుధవారం ఎంపికలు నిర్వహించామని యూనివర్సిటీ పీడీ.వై.శ్రీనివాసులు తెలిపారు. యూనివర్సిటీ ఉపకులపతి(VC) జి ఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు మాట్లాడుతూ.. క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీ సత్య భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.