News September 24, 2025

HYD: ‘విశ్వనగరం అంటే నవ్వుతున్నారు..!’

image

HYDను విశ్వనగరం చేస్తామని ప్రభుత్వ పెద్దలు అంటున్నారని, కానీ ఒకసారి కార్లు దిగి రోడ్ల పరిస్థితి చూడాలని ప్రజలు అంటున్నారు. ఉప్పల్-నారపల్లి, JBS-కార్ఖానా-అల్వాల్, బంజారాహిల్స్ తదితర చోట్ల రోడ్లు దారుణంగా ఉన్నాయని చెబుతున్నారు. రోడ్లను చూసి విశ్వనగరం అంటే బయట నవ్వుతున్నారని ఫైర్ అవుతున్నారు. ఏడాదిగా అవస్థలు పడుతున్నా పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. మీ ప్రాంతంలో రోడ్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

Similar News

News September 25, 2025

HYDను ‘గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం: మంత్రి

image

HYDను ‘గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన HCA సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (GCC)ను రాయదుర్గంలో బుధవారం ఆయన ప్రారంభించారు. అమెరికా, యూకేలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్‌సీఏ హెల్త్‌కేర్‌కు 190 ఆసుపత్రులు, 2,400 కేర్ సైట్లు ఉన్నాయని చెప్పారు.

News September 25, 2025

HYD: నిత్యావసర ధరలు తగ్గడంతో ప్రజలు హ్యాపీ: ఎంపీ

image

దీపావళికి ముందే అందరి ఇళ్లలోకి లక్ష్మీదేవి రావడంతో సంతోషంగా ఉన్నారని బీజేపీ ఎంపీ కే.లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ GST తీసుకురావడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతున్నాయని వెల్లడించారు. చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మోదీ తీసుకొచ్చిన సంస్కరణలే ఇందుకు కారణమని చెప్పారు. కాంగ్రెస్ పన్నుల నుంచి మోదీ ప్రభుత్వం ఉపశమనం కల్పించిందని తెలిపారు.

News September 25, 2025

HYD: బతుకమ్మ ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమీక్ష

image

ఈనెల 29న సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించే భారీ బతుకమ్మ ఏర్పాట్లపై సీఎస్ రామకృష్ణ సమీక్ష నిర్వహించారు. ఈనెల 26న రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ కుంటలో బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. ఈనెల 29న నిర్వహించే కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డ్‌లో నమోదయ్యే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.