News September 24, 2025
రూ.100 లంచం ఆరోపణ.. 39 ఏళ్ల న్యాయ పోరాటం

ఓ తప్పుడు ఆరోపణ రాయ్‌పుర్‌కు చెందిన జగేశ్వర్ ప్రసాద్(83) జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేసింది. MPSRTCలో బిల్లింగ్ అసిస్టెంట్ జగేశ్వర్‌ను సహోద్యోగి 1986లో లంచం కేసులో ఇరికించాడు. 1988-1994 వరకు సస్పెన్షన్, తర్వాత సగం జీతంతో బదిలీ చేశారు. ప్రమోషన్, ఇంక్రిమెంట్ లేదు. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఆ ఒత్తిడితో భార్య చనిపోయింది. ఆఖరికి 39 ఏళ్ల తర్వాత హైకోర్టు ఆయన్ను నిర్దోషిగా తేల్చింది.
Similar News
News September 25, 2025
సీడీఎస్ అనిల్ కుమార్ పదవీకాలం పొడిగింపు

భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) జనరల్ అనిల్ కుమార్ చౌహాన్ పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. సెప్టెంబర్ 30తో ఆయన పదవీకాలం ముగియనుండగా వచ్చే ఏడాది మే 30 వరకు సర్వీసును పొడిగిస్తున్నట్లు పేర్కొంది. 40 ఏళ్ల పాటు సైన్యంలో పలు హోదాల్లో పనిచేసిన చౌహాన్ 2021 మే నెలలో ఈస్టర్న్ ఆర్మీ కమాండ్ చీఫ్‌గా పదవీ విరమణ చేశారు. 2022 సెప్టెంబర్‌లో ఆయనను దేశ రెండో సీడీఎస్‌గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే.
News September 25, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 25, 2025
గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల

TG: గ్రూప్-1 విషయంలో సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ <<17813238>>స్టే<<>> విధించిన క్రమంలో TGPSC ఫైనల్ రిజల్ట్‌ను విడుదల చేసింది. మొత్తం 563 పోస్టులకు 562 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపింది. కోర్టు కేసు కారణంగా ఒక్క పోస్ట్ ఫలితం పెండింగ్‌లో ఉంచినట్లు పేర్కొంది. అభ్యర్థుల జాబితా కోసం ఇక్కడ <