News September 24, 2025
ప్రతి విద్యాసంస్థల్లో నో డ్రగ్స్: ఎస్పీ

జిల్లాలో ప్రతి విద్యాసంస్థల్లో నో డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లాలో 250 పాఠశాలలో ఈగల్ టీములను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తామన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
Similar News
News September 25, 2025
5 ఇసుక డిసిల్టేషన్ పాయింట్లకు అనుమతులు జారీ: కలెక్టర్

జిల్లాలో అదనంగా 5 ఇసుక డిసిల్టేషన్ పాయింట్లకు అనుమతులు జారీ చేసినట్లు కలెక్టర్ సిరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సీ బెలగల్ మండలంలోని కొత్తకోట, సింగవరం, ఈర్లదిన్నె, ముడుమాల, పల్లదొడ్డి గ్రామాల్లో ఇసుక లోడింగ్‌కు అనుమతులు ఇచ్చామన్నారు. వినియోగదారుల కోసం జిల్లాలో 12 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు.
News September 25, 2025
రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోండి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. ప్రమాదకరమైన బ్లాక్ స్పాట్ల వద్ద వెంటనే బారికేడింగ్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. గుర్తించిన 84 అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. రాత్రిపూట ప్రమాదాల నివారణకు రోడ్లపై రోడ్ స్టడ్స్ (సూచికలు), సీసీ కెమెరాలను అమర్చాలని సూచించారు.
News September 24, 2025
జిల్లాలో నాటు సారాను పూర్తిగా నిర్మూలించండి: కలెక్టర్

జిల్లాలో నాటు సారాను పూర్తిగా నిర్మూలించే చర్యలు తీసుకోవాలని, సారా వల్ల జరిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించాలని నవోదయం సమావేశంలో అధికారులను కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన నాటుసారా నిర్మూలనపై సమీక్షా సమావేం జరిగింది. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు.