News April 5, 2024
జగన్ రూ.13 లక్షల కోట్ల అప్పు చేశారు: చంద్రబాబు

AP: ప్రజల జీవితాలతో ఆడుకునే జలగ జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. నరసాపురం సభలో మాట్లాడుతూ.. ‘వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.13 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసింది. జగన్.. జే బ్రాండ్ మద్యం, గంజాయి, డ్రగ్స్ తెచ్చారు. వైసీపీ నాయకులే వాటిని అమ్ముతున్నారు. కిరాయి దుకాణాల్లోనూ గంజాయి దొరుకుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీని 160 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాల్లో గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు.
Similar News
News October 28, 2025
మీరు వాడే పసుపు నాణ్యమైనదేనా? ఇలా చెక్ చేయండి

అన్ని రకాల వంటల్లో పసుపుదే కీలకపాత్ర. అయితే ఇటీవల కల్తీ పసుపు మార్కెట్లోకి వస్తోంది. దీన్ని గుర్తించడానికి కొన్ని చిట్కాలున్నాయి. ఒక గ్లాసు వెచ్చని నీళ్లలో చెంచా పసుపు వేసి 20ని. ఉంచాలి. స్వచ్ఛమైనదైతే గ్లాస్ అడుగుకు పసుపు చేరుతుంది. పైకి తేలితే కల్తీ. అలాగే చేతిపైన కొద్దిగా పసుపు వేసి కాసేపు నలపాలి. మృదువుగా అనిపించి రంగు మారకుంటే నాణ్యమైనది. గరుకుగా ఉండి రంగు మారితే నకిలీ.
News October 28, 2025
అవసరమైతే కేంద్రం సాయం కోరుతాం: CBN

AP: అందరూ సహాయక చర్యల్లో పాల్గొనాలని CM చంద్రబాబు కూటమి నేతలకు టెలీకాన్ఫరెన్స్‌లో పిలుపునిచ్చారు. ‘రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తుఫాను తీరం దాటుతుంది. కృష్ణా, ప.గో, కోనసీమ, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ప్రాణనష్టం పూర్తిగా తగ్గించడం, ఆస్తినష్టం నివారించేలా చర్యలు చేపట్టాం. పిల్లలు, గర్భిణులు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలి. అవసరమైతే కేంద్రం సాయం కోరుతాం’ అని తెలిపారు.
News October 28, 2025
కళ్ల కింద డార్క్ సర్కిల్స్.. ఇలా మాయం

ఒత్తిడి, హార్మోన్ల ప్రభావం, నిద్రలేమి, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువగా చూడటం వల్ల మహిళల్లో కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. ఈ సమస్యకు ఇంట్లోని పదార్థాలతోనే సహజంగా తగ్గించుకోవచ్చు. పచ్చి పాలు/బంగాళదుంప రసంలో దూదిని ముంచి కళ్ల కింద పెట్టి 20ని. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజుకు 2సార్లు ఇలా చేయాలి. బంగాళదుంప/కీరా ముక్కను కళ్లకింద 10ని. రుద్ది నీటితో కడిగేసుకున్నా ప్రయోజనం ఉంటుంది.


