News September 24, 2025
అమలాపురం: జిల్లా గణాంక అధికారిగా మురళీకృష్ణ

జిల్లా గణాంక అధికారిగా మురళీకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సహాయ సంచాలకుడి పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి లభించడంతో ఉప సంచాలకుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనను అభినందించి, సమర్థవంతంగా, సేవా దృక్పథంతో విధులు నిర్వహించాలని కోరారు.
Similar News
News September 25, 2025
జనగామ: ప్రజాపాలన దరఖాస్తుల వివరాల సర్దుబాటు..!

జిల్లాలోనీ మండల పరిషత్, మున్సిపాలిటీ, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలకు వచ్చిన 15,954 దరఖాస్తుల వివరాలను సరిచేసినట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 14 ప్రజాపాలన కేంద్రాల ద్వారా ప్రజా పాలనలో చేసుకున్న దరఖాస్తుల్లో తప్పులు ఉన్న వాటిని సవరించినట్లు పేర్కొన్నారు.
News September 25, 2025
వాంగ్‌చుక్ ప్రకటనలతోనే లేహ్‌లో అల్లర్లు: కేంద్రం

పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటనలతోనే లద్దాక్‌లో <<17816320>>అల్లర్లు<<>> జరిగాయని కేంద్ర హోంశాఖ ప్రకటన రిలీజ్ చేసింది. పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు సాయంత్రానికి అదుపులోకి వచ్చాయని పేర్కొంది. లద్దాక్ ప్రజలకు రాజ్యాంగపరమైన రక్షణను కల్పిస్తూ వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వీడియోలను షేర్ చేయొద్దని సూచించింది.
News September 25, 2025
నిర్మల్ కలెక్టరేట్‌లో దివ్యాంగులకు తిప్పలు

జిల్లా కలెక్టరేట్‌లో లిఫ్టులు పనిచేయకపోవడంతో పై అంతస్తులకు వెళ్లేందుకు దివ్యాంగులకు, వృద్ధులకు ఇబ్బందులు తప్పడం లేదు. వివిధ పనుల నిమ్మిత్తం కలెక్టరేట్‌కు వచ్చిన దివ్యాంగులు, ముసలి వారు పై అంతస్థుతులకు వెళ్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. చాలా రోజుల నుంచి ఈ సమస్య ఉందని వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుధాకర్ అన్నారు. కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.