News September 24, 2025

5 వికెట్లు కోల్పోయిన భారత్

image

ASIA CUP: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 5 వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ (75) రాణించినా.. మిగతా ప్లేయర్లు భారీ షాట్లకు ప్రయత్నించి తక్కువ స్కోర్లకే వెనుదిరుగుతున్నారు. ఈ క్రమంలో గిల్(29), దూబే(2), సూర్య(5), తిలక్(5) వికెట్లు కోల్పోయారు. ప్రస్తుతం క్రీజులో హార్దిక్, అక్షర్ పటేల్ ఉన్నారు. 15 ఓవర్లకు భారత్ స్కోర్ 132/5గా ఉంది.

Similar News

News February 12, 2026

రష్యాలో వాట్సాప్‌పై నిషేధం.. టెలిగ్రామ్‌పై ఆంక్షలు!

image

వాట్సాప్‌ను బ్యాన్ చేసినట్లు రష్యా ధ్రువీకరించింది. తమ చట్టాలను పాటించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. 100 మిలియన్ల యూజర్లను స్వదేశీ మెసెంజర్ యాప్ ‘MAX’కు మారాలని కోరినట్లు పేర్కొన్నారు. అయితే మ్యాక్స్ సర్వైలెన్స్(నిఘా) యాప్ అని ఆరోపణలు రాగా వాటిని అధికారులు ఖండించారు. ‘టెలిగ్రామ్‌’పైనా దశలవారీగా ఆంక్షలు విధించే యోచనలో రష్యా ఉన్నట్లు సమాచారం.

News February 12, 2026

11 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయిన భారత్

image

నమీబియాతో మ్యాచులో మరింత స్కోర్ చేయాల్సిన IND 209రన్స్‌కే పరిమితమైంది. ఒక దశలో 250 దాటుతుందని భావించినా ఇన్నింగ్స్ చివరి 11బంతుల్లో 5వికెట్లు కోల్పోవడంతో స్కోర్ పడిపోయింది. ఊపు మీదున్న పాండ్య 19వ ఓవర్‌ రెండో బాల్‌కు ఔట్ కాగా తర్వాతి బంతికి దూబే రనౌట్ అయ్యారు. అదే ఓవర్ చివరి బాల్‌కు అక్షర్ బౌల్డ్ అయ్యారు. 20వ ఓవర్ మూడో బంతికి రింకూ, చివరి బాల్‌కు అర్ష్‌దీప్ ఔటయ్యారు. 11 బాల్స్‌లో 4 రన్సే వచ్చాయి.

News February 12, 2026

T20 WC: భారత్ భారీ స్కోర్

image

నమీబియాతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 209/9 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్ (61), హార్దిక్ (52) రాణించారు. దూబే 23, శాంసన్ 22, తిలక్ 25, సూర్య 12 పరుగులు చేశారు. 19వ ఓవర్లో భారత్ 3 వికెట్లు(పాండ్య, దూబే, అక్షర్) కోల్పోవడంతో స్కోర్ కాస్త తగ్గింది.