News April 5, 2024
8 కులాల వ్యక్తులు గెలిచిన సెగ్మెంట్ ఏదంటే?

APలో రాజమండ్రి అర్బన్ సెగ్మెంట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. 8 కులాల వ్యక్తులు గెలిచిన ఏకైక నియోజకవర్గం ఇదే. కమ్మ- ప్రభాకర్ చౌదరి(1952, 67), బుచ్చయ్య చౌదరి(1983, 85, 94, 99), కాపు-వీరభద్రరావు(1962), సత్యనారాయణ(2014), రెడ్డి- ACY రెడ్డి(1989), కొప్పుల వెలమ- ఆదిరెడ్డి భవాని(2019), బ్రాహ్మణ-నాగేశ్వరరావు(1955), వైశ్య-సత్యవతి(1978), తూర్పు కాపు-రౌతు సూర్యప్రకాశ్(2004,09), పద్మశాలి-మల్లికార్జునరావు(1972).
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News April 7, 2026
HYD: మృత్యువుతో ముద్దులాట ‘సిటీ రేసింగ్’

HYD కుర్రాళ్లకు ఏమైంది? ప్రాణాలను ఫణంగా పెట్టి గాల్లో విన్యాసాలు చేస్తూ ‘వీల్‌యింగ్’ పిచ్చితో రోడ్లపై రెచ్చిపోతున్నారు. ‘సిటీ రేసింగ్’, ‘ట్రాఫిక్ స్టంట్స్’ పేర్లతో గ్యాంగ్‌లుగా జనాల మీదకు బైకులతో దూసుకొస్తున్నారు. పోలీసులు కేసులు పెట్టి, బైకులు సీజ్ చేస్తున్నా వీరిలో మార్పు రావడం లేదు. క్రేజ్ కోసం కన్నవారికి కడుపుకోత మిగిల్చకండి. రోడ్డు మీద విన్యాసాలు చేస్తే జైలులో ఊచలు లెక్కపెట్టాల్సిందే!
News April 7, 2026
ఇది ఏపీ ప్రజల విజయం: సీఎం చంద్రబాబు

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం గెజిట్ <<19585476>>నోటిఫికేషన్<<>> విడుదల చేయడంపై CM చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజలు, అమరావతి రైతుల విజయం అని పేర్కొన్నారు. ‘రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధాని మోదీకి ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వానికి, ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎంపీలందరికీ, రాష్ట్ర నాయకులకు, ప్రజలకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.
News April 7, 2026
వర్షం.. KKRvsPBKS మ్యాచ్ రద్దు

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన KKRvsPBKS మ్యాచ్ రద్దయ్యింది. వర్షం ఎంత సేపటికీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ఇవాళ KKR టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది. మ్యాచ్ ఆగే సమయానికి 3.4 ఓవర్లలో 25/2 స్కోర్ చేసింది. ఇక 2025 ఏప్రిల్ 26న కూడా ఇదే వేదికలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగానే రద్దయ్యింది.


