News April 5, 2024

మాజీ ఎంపీ వీ.హనుమంత రావు కీలక వ్యాఖ్యలు

image

మాజీ ఎంపీ వీ.హనుమంత రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అని, రాహుల్ గాంధీ సెక్యులర్ సిద్ధాంతాలో పనిచేస్తున్నారని అన్నారు. BRS నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నా.. మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులు, కార్యకర్తలకు అన్యాయం చేయొద్దన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 14 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News December 28, 2025

సత్తుపల్లి – ఖమ్మం ప్రయాణం ఇక 34 నిమిషాలే: తుమ్మల

image

గ్రీన్‌ఫీల్డ్ రహదారి అందుబాటులోకి వస్తే సత్తుపల్లి నుంచి ఖమ్మంకు కేవలం 34 నిమిషాల్లోనే చేరుకోవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జనవరి తర్వాత ఈ రహదారిని ప్రారంభిస్తామని గంగారంలో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు. సత్తుపల్లి అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని, ఇప్పటికే గోదావరి జలాలతో నియోజకవర్గంలోని చెరువులను నింపుతున్నట్లు పేర్కొన్నారు.

News December 28, 2025

నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు: అర్బన్‌ ఏవో

image

కామేపల్లి మండలం బాసిత్‌నగర్‌ రైతులకు సరఫరా అయిన నకిలీ విత్తనాల వ్యవహారంపై అధికారులు స్పందించారు. దీనిపై ఖమ్మం అర్బన్‌ ఏవో కిషోర్‌ వివరణ ఇస్తూ.. క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తలు, అధికారులు పంటను సందర్శించి నివేదిక అందజేస్తారని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా నకిలీ విత్తనాలు విక్రయించిన సంబంధిత దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

News December 28, 2025

ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్‌ వద్ద రోడ్డు ప్రమాదం

image

ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిలో, వెనుక కూర్చున్న మహిళ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఆమె కాళ్లపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. క్షతగాత్రురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆమె వివరాలు తెలియాల్సి ఉంది.