News September 25, 2025
బెల్లంపల్లి: 316 మంది కార్మికులు రెగ్యూలరైజ్

సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా పనిచేస్తూ 190/240 మస్టర్లు పూర్తి చేసిన 258 మంది కార్మికులను జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1గా క్రమబద్ధీకరిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. బెల్లంపల్లి రీజియన్‌లోని శ్రీరాంపూర్ ఏరియాలో 241, మందమర్రి ఏరియాలో 64, బెల్లంపల్లి ఏరియాలో 11 మంది ఉద్యోగులు రెగ్యూలరైజ్ అయ్యారు. భూగర్భ గనుల్లో 190, ఓసీలు, సర్ఫేస్‌లో 240 మస్టర్లు పూర్తి చేసిన వారు అర్హులు
Similar News
News September 25, 2025
ఆసియాకప్ నుంచి శ్రీలంక ఔట్

ఆసియాకప్ 2025లో శ్రీలంక ఇంటి బాట పట్టింది. నిన్నటి మ్యాచులో బంగ్లాదేశ్‌పై టీమ్ ఇండియా గెలవడంతో ఆ జట్టు ఆశలు గల్లంతయ్యాయి. ఇవాళ పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచులో గెలిచిన జట్టు ఫైనల్ చేరనుంది. పాక్ గెలిస్తే ఈ ఎడిషన్‌లో మూడో సారి టీమ్‌ఇండియాతో తలపడనుంది. అటు రేపు జరిగే భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్ నామమాత్రమే కానుంది. కాగా ఫైనల్ ఈ నెల 28న జరగనుంది.
News September 25, 2025
బాల్యవివాహం రద్దు

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం మైలసముద్రంలో బాల్య వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలో ఓ బాలికకు వివాహం చేయడానికి తల్లిదండ్రులు నిశ్చయించారు. బుధవారం డయల్ 100 ద్వారా సమాచారం తెలుసుకున్న కొత్తచెరువు సీఐ మారుతి శంకర్ బాలిక తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు పెళ్లి రద్దు చేసుకున్నారు. కౌన్సెలింగ్‌లో అంగన్వాడీ టీచర్లు, మహిళా పోలీస్ పాల్గొన్నారు.
News September 25, 2025
రాంగ్‌రూట్ ప్రయాణం ప్రమాదకరం: వరంగల్ పోలీసులు

షార్ట్‌కట్ కోసం రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం ప్రాణాలకే ప్రమాదమని వరంగల్ పోలీసులు హెచ్చరించారు. జీవితంలోనే కాకుండా రోడ్లపై కూడా తప్పు మార్గం ఎంచుకోవడం అత్యంత ప్రమాదకరమని, దీని వల్ల ఇతరుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలను పాటించి రాంగ్‌రూట్ డ్రైవింగ్‌ను నివారించాలని కోరుతూ, ఈ హెచ్చరికను వరంగల్ పోలీసులు తమ అధికారిక X(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.