News April 5, 2024

ఘోరం.. అత్యాచారానికి గురైన బాలికను పరీక్షలు రాయనివ్వలేదు

image

సామూహిక అత్యాచారానికి గురైన 12వ తరగతి బాలికను పరీక్షలు రాయనివ్వకుండా ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం అడ్డుకుంది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగింది. దీంతో ఆమె CWCకి ఫిర్యాదు చేశారు. తాను పరీక్షకు వస్తే వాతావరణం చెడిపోతుందని చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 4నెలలు స్కూల్‌కు రానందుకే అడ్మిట్ కార్డు ఇవ్వలేదని యాజమాన్యం చెప్పగా, వారి సూచన మేరకే తాను ఇంటి వద్ద ప్రిపేర్ అయ్యానని బాలిక తెలిపారు.

Similar News

News February 5, 2025

రాహుల్.. ఎన్నికల గాంధీగా పేరు మార్చుకోండి: కేటీఆర్

image

TG: నిన్న అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి క్లారిటీ లేదని, బీసీ డిక్లరేషన్ పేరుతో సిగ్గులేకుండా అబద్ధాలు చెప్పిందనే విషయాలు ప్రజలకు అర్థమయ్యాయని KTR ట్వీట్ చేశారు. కులగణన నివేదికతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టమైందని తెలిపారు. గ్యారంటీలు, హామీలు, డిక్లరేషన్లు రాజకీయాల కోసమేనని అర్థమైందన్నారు. రాహుల్ గాంధీ పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకోవాలన్నారు.

News February 5, 2025

రోహిత్ శర్మ రిటైర్‌మెంట్?

image

ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. BCCI వర్గాల సమాచారం ప్రకారం.. భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వాలని బోర్డు ఇప్పటికే రోహిత్‌కు సూచించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం రోహిత్ తన రిటైర్మెంట్‌పై ఓ నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆధారంగా కొత్త సారథిని ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది.

News February 5, 2025

WORLD RECORD: ఒంగోలు జాతి ఆవు ధర రూ.41 కోట్లు

image

సాధారణంగా ఆవు ధర వేలల్లో, కాస్త పాలు ఎక్కువగా ఇచ్చే రకమైతే రూ.1-2 లక్షలు ఉంటుంది. అయితే ఒంగోలు/నెల్లూరు బ్రీడ్‌కు చెందిన వయాటినా-19 అనే ఆవు జ్రెజిల్‌లో నిర్వహించిన వేలంలో ఏకంగా రూ.41 కోట్లకు అమ్ముడైంది. దీంతో గతంలో ఉన్న రికార్డులన్నీ బ్రేకయ్యాయి. కాగా 1800sలో ఒంగోలు ఆవును బ్రెజిల్‌కు తీసుకెళ్లారు. అక్కడ అనేక జెనెటిక్ మార్పులతో ప్రాచుర్యం పొందింది. వయాటినా-19 బరువు ఏకంగా 1,101kgలు.

error: Content is protected !!