News September 25, 2025
గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల

TG: గ్రూప్-1 విషయంలో సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ <<17813238>>స్టే<<>> విధించిన క్రమంలో TGPSC ఫైనల్ రిజల్ట్‌ను విడుదల చేసింది. మొత్తం 563 పోస్టులకు 562 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపింది. కోర్టు కేసు కారణంగా ఒక్క పోస్ట్ ఫలితం పెండింగ్‌లో ఉంచినట్లు పేర్కొంది. అభ్యర్థుల జాబితా కోసం ఇక్కడ <
Similar News
News September 25, 2025
పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీ రివ్యూ&రేటింగ్

తాను నమ్మే వ్యక్తి కోసం, మాఫియాను అంతం చేయడానికి హీరో ఏం చేశాడనేదే ‘OG’ కథ. పవన్ యాక్టింగ్, ఇమ్రాన్ హష్మీ విలనిజం, తమన్ మ్యూజిక్, ఎలివేషన్స్ పాజిటివ్. డైరెక్టర్ సుజిత్ ఫ్యానిజం తెరపై కనిపిస్తుంది. అయితే కథ కంటే ఎలివేషన్స్‌పైనే ఫోకస్ చేయడం మైనస్. ట్విస్టులు, ఎమోషన్స్ లేకపోవడంతో పాటు హీరోయిన్‌కు పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. క్లైమాక్స్ రొటీన్‌గా అనిపిస్తుంది. ఫ్యాన్స్‌కు మాత్రం పండగే.
రేటింగ్: 2.5/5
News September 25, 2025
రేపే బీసీ రిజర్వేషన్ల జీవో జారీ?

TG: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం రేపు జీవో జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 27న కలెక్టర్లు అన్ని పార్టీలతో మీటింగ్ ఏర్పాటు చేసి రిజర్వేషన్లను వివరించనున్నారు. ఆ వెంటనే ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసి, 28న రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనున్నట్లు సమాచారం. 29న స్థానిక ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటిస్తుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.
News September 25, 2025
పశువుల్లో రేబీస్ వ్యాధి లక్షణాలు- నివారణ

రేబీస్ వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వస్తుంది. తర్వాత కేంద్రనాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల పశువులు అసాధారణంగా ప్రవర్తిస్తాయి. కండరాలలోని నరాలు దెబ్బతినడం వల్ల పక్షవాతం సోకుతుంది. మేతను మింగలేకపోవడం, నీటిని చూసి భయపడటం, అధిక లాలాజలం స్రవించడం, బలహీనత, ఎక్కువగా అరవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువులను కుక్క కరిస్తే సాధ్యమైనంత త్వరగా వెటర్నరీ డాక్టరు సూచనలతో యాంటీరేబీస్ టీకా వేయించాలి.