News September 25, 2025

ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణకు ప్రత్యేక కమిటీ

image

విశాఖపట్నం ఎర్రమట్టి దిబ్బల రక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఇద్దరు, రెవెన్యూ శాఖ నుంచి ఇద్దరు అధికారులతో కమిటీ ఏర్పడనుంది. దిబ్బల సరిహద్దులు గుర్తించి రక్షణ చర్యలు చేపడుతుంది. 2014 నోటిఫికేషన్ ప్రకారం వీటిని వారసత్వ ప్రదేశాలుగా సంరక్షించాలని స్పష్టం చేసింది. జనసేన కార్పొరేటర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ తీర్పు వెలువడింది.

Similar News

News September 27, 2025

విశాఖలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం

image

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రూజ్ కలనరీ అకాడమీ (సీసీఎ) ఆధ్వర్యంలో ఆర్కేబీచ్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏపీ పర్యాటక జిల్లా అధికారి మాధవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ టూరిజం హబ్‌గా మారనుందని ఆమె పేర్కొన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని సంస్థ డైరెక్టర్లు పేర్కొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

News September 27, 2025

ఏయూ: అక్టోబర్ 3న PHD ప్రవేశాలకు ఇంటర్వ్యూలు

image

ఏయూలో వివిధ కోర్సుల్లో PHD ప్రవేశాలకు సంబంధించి UGC నెట్, CSIR‌ నెట్, గేట్, తదితర జాతీయస్థాయి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్యూలు నిర్వహించనున్నట్లు ప్రవేశాల సంచాలకుడు డీ.ఏ.నాయుడు తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో అక్టోబర్ 3వ తేదీన ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు.

News September 27, 2025

ఏయూ: న్యాయవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

image

ఏయూలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ న్యాయ కళాశాలలో వివిధ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంచినట్లు ప్రవేశాల సంచాలకుడు ఆచార్య డిజే.నాయుడు తెలిపారు. ఐదేళ్ల న్యాయవిద్య, మూడేళ్ల న్యాయవిద్య, 2 సంవత్సరాల పీజీ ఎల్ఎల్ఎం కోర్సులను సెల్ఫ్ సపోర్ట్ విధానంలో దరఖాస్తు చేసేందుకు అక్టోబర్ 9వ తేదీ వరకు గడువు పొడిగించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.