News April 5, 2024
ఎవరీ నితీశ్ రెడ్డి?

CSKతో మ్యాచులో SRH జట్టులో చోటు దక్కించుకున్న నితీశ్ రెడ్డి స్వస్థలం విశాఖపట్నం. ఆల్‌రౌండర్‌గా పేరొందిన అతడు.. 2017-18లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో 1,237 రన్స్ చేయడంతో వెలుగులోకి వచ్చారు. అదే ట్రోఫీలో నాగాలాండ్‌పై 414 రన్స్‌తో చెలరేగారు. 2022-23లో రంజీ ట్రోఫీ సీజన్‌లో రాణించిన అతడు.. 34 వికెట్లు పడగొట్టారు. కాగా నితీశ్‌కు ఇది రెండో ఐపీఎల్ మ్యాచ్.
Similar News
News April 23, 2025
PHOTO: పహల్‌గామ్‌లో దాడి చేసింది వీరే

జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఫొటో బయటకు వచ్చింది. నలుగురు ముష్కరులు కలిసి ఉన్న ఫొటోను అధికారులు విడుదల చేశారు. వారి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. వీరిలో ముగ్గురిని ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా అధికారులు గుర్తించారు. నిన్న వీరు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే.
News April 23, 2025
టెన్త్ ఫలితాలు.. ఒక్క మార్క్ మాత్రమే వచ్చింది!

ఏపీ టెన్త్ ఫలితాల్లో ఓ స్టూడెంట్‌కు షాకింగ్ ఫలితాలు వచ్చాయి. 600 మార్కులకు గాను ఒక్క మార్క్ మాత్రమే వచ్చింది. సైన్స్‌లో ఒక్క మార్కు రాగా, మిగతా 5 సబ్జెక్టుల్లో సున్నా మార్కులు వచ్చాయి. దీంతో ఫలితాలు ఇలా రావడం ఫస్ట్ టైమ్ అనే చర్చ జరుగుతోంది.
*ప్రైవసీ దృష్ట్యా సదరు విద్యార్థి వివరాలను ఇక్కడ ఇవ్వట్లేదు.
News April 23, 2025
IPL: నల్ల బ్యాండ్లు ధరించనున్న ప్లేయర్లు

పహల్‌గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా ఇవాళ SRHvsMI మ్యాచులో ప్లేయర్లు, అంపైర్లు చేతులకు నల్ల బ్యాండ్లు ధరించనున్నారు. అలాగే మ్యాచుకు ముందు నిమిషం పాటు మౌనం పాటిస్తారని క్రీడా వర్గాలు తెలిపాయి. చీర్ లీడర్లు, ఫైర్ వర్క్స్ సెలబ్రేషన్స్‌ను కూడా నిర్వాహకులు రద్దు చేశారని పేర్కొన్నాయి. ఇవాళ HYD ఉప్పల్ స్టేడియంలో రా.7.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది.