News April 5, 2024

కరీంనగర్: 21.30 క్వింటాళ్ల గన్ పౌడర్ స్వాధీనం

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం జాగిరిపల్లిలో నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ, రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్, స్థానిక ఎస్సై జన్ను ఆరోగ్యం పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా హుజూరాబాద్ గ్రామానికి చెందిన కన్నబోయిన మహేందర్ ఒక రూమంలో అక్రమంగా 21.30 క్వింటాళ్ల గన్ పౌడర్ దాచి పెట్టినట్లు ఎస్సై చెప్పారు. అతడిపై కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News December 28, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని క్రైమ్ న్యూస్

image

☞పెద్దపల్లి: పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దొంగ అరెస్టు ☞మల్లాపూర్: కారు, బైకు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు ☞శంకరపట్నం: ఏసీబీ అధికారులకు పట్టుబడిన డిప్యూటీ తహసిల్దార్ ☞మెట్ పల్లి: అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య ☞రామగుండం: అన్ లైన్ గేమ్ పేరుతో మోసం.. వ్యక్తి అరెస్టు ☞పెగడపల్లి: అనారోగ్యంతో ఆరవెల్లి BRS గ్రామ శాఖ అధ్యక్షుడు మృతి ☞రామగుండం: భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య

News December 28, 2024

నితీష్ కుమార్ రెడ్డి ఫ్యూచర్లో కెప్టెన్ అవుతారు: కేటీఆర్

image

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ తరపున సెంచరీ చేసిన యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిని కేటీఆర్ అభినందించారు. టెర్రిఫిక్ ఇన్నింగ్స్ నితీశ్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యూచర్ కెప్టెన్ నితీశ్ అంటూ ఆకాశానికి పొగిడారు.

News December 28, 2024

కరీంనగర్‌కు నాస్కామ్ శుభవార్త!

image

కరీంనగర్‌కు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(NASSCOM) శుభవార్త చెప్పింది. HYD తర్వాత కరీంనగర్ నగరం గ్లోబల్ కేపబిలీటీ సెంటర్ల(జీసీసీ)కు డెస్టినేషన్‌లుగా మారనున్నాయని తెలిపింది. జిల్లాలో ఐటీ ఇండస్ట్రీకి అవసరమైన ఇంజినీరింగ్ కాలేజీలు, మానవ వనరులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. రాజధానికి దగ్గర్లో ఉండటం, అక్కడితో పోలిస్తే భూముల రేట్లు తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.