News September 25, 2025
అర్థవీడు మండలంలో దారుణ ఘటన

అర్ధవీడు మండలంలోని గన్నేపల్లిలో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ వ్యక్తిని మరో వ్యక్తి కర్రతో దాడి చేసి అతి క్రూరంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 27, 2025
ప్రకాశంలో పర్యాటక అందాలు ఎన్నో ఎన్నెన్నో..!

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం. ప్రకాశం జిల్లాలో పర్యాటక ప్రదేశాల జాబితా కోకొల్లలు. ఇటు ఆధ్యాత్మిక, అటు ప్రకృతి హొయలు గల పర్యాటక ప్రదేశాలు జిల్లాలో ఉన్నాయి. భైరవకోన, త్రిపురాంతకేశ్వర ఆలయం, రాచర్ల నెమలిగుండ్ల రంగనాయకస్వామి, మాలకొండ, సింగరాయకొండ నరసింహస్వామి క్షేత్రం వంటి ఆలయాలు ఉన్నాయి. కొత్తపట్నం, పాకల బీచ్‌లు, మైలవరం డ్యాం, నల్లమల అడవుల అందాలు ఎన్నో. మరి ఈ దసరాకు మీరు ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారు.
News September 27, 2025
ప్రకాశం: ‘ఒకరికి ఒక్క ఓటే ఉండాలి’

ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఓటరు ఒక ఓటు మాత్రమే కలిగి ఉండాలని DRO చిన్న ఓబులేసు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గల డిఆర్వో ఛాంబర్‌లో శుక్రవారం గుర్తింపు పొందిన పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ మాట్లాడుతూ.. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోనివారు, వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. 18ఏళ్ళు నిండిన యువత ఓట్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.
News September 27, 2025
ప్రకాశం: ‘పన్నుల తగ్గింపుపై ప్రచారం చేయాలి’

వస్తు సేవా పన్నులను ప్రభుత్వం తగ్గించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు శుక్రవారం తెలిపారు. ఒంగోలు కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, MROలు, ఎంపీడీవోలతో శుక్రవారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వస్తు సేవల పన్ను తగ్గింపుపై విస్తృతమైన ప్రచారం చేయాలన్నారు. అలాగే ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.