News September 25, 2025

150 రోజుల్లో 150 కేసులేసినా డీఎస్సీ పూర్తి చేశాం: లోకేశ్

image

AP: మెగా డీఎస్సీ నియామక ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేశామని మంత్రి లోకేశ్ అన్నారు. ‘విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఏకంగా చాగంటి కోటేశ్వరరావుకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి నైతిక విలువలపై సలహాదారుగా నియమించాం. అయినా ఆయన ఒక్క కారు, ఫోన్ కూడా తీసుకోలేదు. డీఎస్సీని ఆపేందుకు ముందు నుంచి ఎంతోమంది ప్రయత్నించారు. 150 రోజుల్లో 150 కేసులేసినా నియామకాలు పూర్తి చేశాం’ అని స్పష్టం చేశారు.

Similar News

News February 3, 2026

మునగపాక: శారదా నదిలో కుళ్లిన స్థితిలో డెడ్‌బాడీ

image

మునగపాక మండలం ఉమ్మలాడ గ్రామ పరిధిలో శారదా నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్సై ప్రసాదరావు తెలిపారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని సోమవారం బయటకు తీయించినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించామన్నారు. మృతుని వయసు 45-50 ఏళ్లు ఉంటుందన్నారు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News February 3, 2026

మహిళలూ.. ఈ లక్షణాలున్నాయా? జాగ్రత్త

image

క్యాన్సర్ లక్షణాలు అన్నిసార్లూ బయటకు కనిపించవు. ముఖ్యంగా మహిళల్లో కొన్ని క్యాన్సర్లు నిశ్శబ్ధంగా శరీరంలో వ్యాపిస్తాయంటున్నారు నిపుణులు. చాలా క్యాన్సర్లను ప్రారంభదశలో గుర్తించడం కష్టమని చెబుతున్నారు. అందుకే మహిళల్లో అసాధారణ వాపు, దీర్ఘకాల అలసట, కారణం లేకుండా బరువు తగ్గడం, చర్మంపై మార్పులు, అసాధారణ రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News February 3, 2026

గతేడాది 19 విమాన ప్రమాదాలు

image

గతేడాది దేశంలో 19 విమాన ప్రమాదాలు జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ ఘటనలపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు చేసిందని వెల్లడించారు. వీటికి సంబంధించిన నివేదికలను AAIB వెబ్‌సైట్‌లో ప్రచురించామని ఆయన తెలిపారు.