News September 25, 2025
విశాఖ: ఏసీబీ వలలో రెవెన్యూ అధికారులు

విశాఖలో లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ACBకి చిక్కారు. రవితేజ తన ఇంటికి సంబందించి సర్వే నంబర్ తప్పుగా ఉందని.. సర్వే చేసి సరైన రిపోర్టు ఇవ్వాలని ములగడ MRO ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నాడు. సర్టిఫికెట్‌కు రూ.30 వేలు లంచం ఇవ్వాలని సర్వేయర్ సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ నగేశ్ డిమాండ్ చేయడంతో ACBకి ఫిర్యాదు చేశాడు. గురువారం మహాత్ కాలనీ సచివాలయం వద్ద లంచం తీసుకుంటుండగా వీరిని పట్టుకున్నారు.
Similar News
News September 27, 2025
సంతానలక్ష్మి అవతారంలో కనుమహాలక్ష్మి అమ్మవారు

బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం అమ్మవారు సంతాన లక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు వేకువజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కలువ పువ్వులతో సహస్రనామార్చన చేపట్టారు. ఈవో శోభారాణి భక్తులకి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
News September 27, 2025
విశాఖ: ‘స్కానింగ్ కేంద్రాల్లో 5% ఉచితంగా వైద్య సేవలు అందించాలి’

విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం జిల్లా స్థాయి అడ్వైజర్ కమిటీ సమావేశం నిర్వహించారు. స్కానింగ్ కేంద్రాలు తనిఖీ చేయాలని, డాక్టర్ల విద్యార్హతలు, సెంటర్ డాక్యుమెంట్స్ పరిశీంచాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని స్కానింగ్ కేంద్రాల్లో 5% ఉచితంగా వైద్య సేవలు అందించాలన్నారు. ఆ వివరాలు జిల్లా వైద్య అధికారికి అందజేయాలన్నారు.
News September 26, 2025
జీఎస్టీ లబ్ధికి అక్టోబర్‌లో షాపింగ్ ఫెస్టివల్: విశాఖ కలెక్టర్

కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ప్రయోజనాలను ప్రజలకు అందించేందుకు ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. వివిధ రంగాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్‌లో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించి, జీఎస్టీ లబ్ధిని ప్రజలకు చేరవేస్తామని వివరించారు.