News September 25, 2025

ఇంటర్ పరీక్షా ఫీజును చెల్లించండి: ఆర్‌ఐఓ

image

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన పరీక్షా ఫీజును అక్టోబర్ 10వ తేదీలోపు చెల్లించాలని ఆర్ఐఓ వరప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.1000 అపరాధ రుసుముతో అక్టోబర్ 21వ తేదీ వరకు చెల్లించవచ్చునని, సంబంధిత కళాశాల ప్రిన్సిపల్స్ నిర్ణీత తేదీలోపు పరీక్షా ఫీజులు చెల్లించాలని, ఈ విషయాన్ని అన్ని కళాశాలలు గమనించాల్సిందిగా కోరారు.

Similar News

News September 27, 2025

నెల్లూరు జిల్లాలో పర్యాటక ప్రదేశాలు ఎన్నో..!

image

నెల్లూరు జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. మైపాడు బీచ్, కోడూరు బీచ్, పాకల బీచ్, కృష్ణపట్నం, రామయ్యపట్నం పోర్టు ఉన్నాయి. అలాగే నెల్లూరులోని రంగనాధస్వామి ఆలయం, జొన్నవాడ కామాక్షి, వేదగిరి లక్ష్మీనరసింహస్వామి, పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు, కసుమూరు, బారాషహీద్ దర్గాలు ఎంతో ప్రసిద్ధి. సోమశిల, కండలేరు డ్యామ్‌, ఉదయగిరి కోట చూడదగ్గ ప్రదేశాలు. మీ ప్రాంతంలో చూడదగ్గ ప్రదేశాలను కామెంట్ చేయండి.

News September 27, 2025

నెల్లూరు: విధులకు రాకున్నా.. పక్కాగా జీతం !

image

గతంలో DMHO గా పనిచేసిన పెంచలయ్య హయాంలో కృష్ణాపురం PHC కి చెందిన ఓ వైద్యాధికారి 2022లో పీజీ కోర్సు చదివేందుకు వెళ్లారు. అప్పట్నుంచి ఆయన విధులకు హాజరువ్వకుండానే దాదాపు రెండేళ్లకు పైగా ప్రతీ నెల జీతం డ్రా చేసినట్లు సమాచారం. గత DMHO పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీనిపై విచారణ అధికారిని సైతం ప్రభుత్వం నియమిస్తూ జీవోను విడుదల చేయడం గమనర్హం. ఏమి జరుగుతుందో వేచి చూడాలి.

News September 27, 2025

నెల్లూరులో నకిలీ సైబర్ క్రైమ్ సీఐ అరెస్ట్

image

ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసిన నకిలీ క్రైమ్ బ్రాంచ్ సీఐ సాయికృష్ణతో పాటు అతని తండ్రి పోలయ్యను వేదయపాలెం పోలీసులు అరెస్టు చేశారు. శివాజీ నగర్‌లో నివాసముంటున్న సాయికృష్ణ విజయవాడ సైబర్ క్రైమ్‌లో సీఐ అంటూ పలువురిని నమ్మించాడు. న్యూ మిలిటరీ కాలనీకి చెందిన వినోద్ కుమార్ దగ్గర రూ.11లక్షలు తీసుకుని మోసం చేశాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశారు.