News April 5, 2024

గాజువాక వైన్ షాప్‌లో చోరీ.. నిందితుడు అరెస్టు

image

గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనగర్ రైల్వే గేట్ వద్ద గల గవర్నమెంట్ వైన్ షాపులో ఈనెల 18న చొరబడి రూ.5,50,580 నగదును దొంగిలించిన మిత్తిరెడ్డి శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.2,85,00 నగదు రూ.38 వేల విలువగల మొబైల్ ఫోన్ రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితుడు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం మంత్రి పాలెం గ్రామానికి చెందినవాడని పోలీసులు తెలిపారు.

Similar News

News January 17, 2026

KGHలో ఆన్‌లైన్ వైద్య సేవలు

image

ఇకపై KGHలో గంటల తరబడి ఓపీ, ఇతర వైద్య పరీక్షల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యలకు చెక్ పెట్టే దిశగా ఈ-పాలన విధానాన్ని KGH అమలు చేయనుంది. రోగులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వైద్య సేవలను ఆన్‌లైన్ విధానంలో అందించడమే లక్ష్యంగా ఈ కొత్త వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు KGH అధికారులు తెలిపారు.

News January 17, 2026

విశాఖ: రాజు గారి ఆవేదన వెనుక కారణం ఇదేనా?

image

విశాఖ MLA విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వీటి వెనుక రాజకీయాలకన్నా టిడ్కో ఇళ్లకు సంబంధించిన పెండింగ్ బకాయిల అంశమే ప్రధాన కారణమన్న చర్చ సాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బిల్లుల రూపంలో విష్ణు కుటుంబానికి సుమారు రూ.120 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం టిడ్కో బకాయిల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.

News January 16, 2026

విశాఖ: 26 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు

image

సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు 2 రోజులుగా విశాఖలో మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌లు,ర వాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 26 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేసి రూ.52,000 జరిమానాలు విధించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలు కొనసాగుతాయన్నారు.