News September 25, 2025
డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు: జేసీ

జిల్లాలో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి చర్యలు చేపట్టినట్లు జేసీ బి.నవ్య తెలిపారు. కొత్తగా 4,056 మంది కార్డుదారులు చేరడంతో మొత్తం 6,68,944 డిజిటల్ రేషన్ కార్డులు ATM సైజు, ఫొటో, రేషన్ షాప్ వివరాలు, క్యూఆర్ కోడ్, E-KYC వివరాలతో ఉంటాయన్నారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 1 వరకు సచివాలయ సిబ్బంది ఇంటి వద్ద పంపిణీ చేస్తారన్నారు. అక్టోబర్ 2 నుంచి రేషన్ షాప్‌ల ద్వారా పొందవచ్చు అన్నారు.
Similar News
News September 26, 2025
నిబంధనలు పాటించని 2 ఆసుపత్రులు సీజ్: కలెక్టర్

నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి పీసీ అండ్ పీఎన్డీటీ సమావేశం నిర్వహించారు. కర్నూలులోని నిబంధనలను పాటించని రక్ష హాస్పిటల్‌తో పాటు కోడుమూరులోని బాషా హాస్పిటల్‌ను సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా వైద్యశాఖ అధికారి శాంతికళ తెలిపారు.
News September 26, 2025
వైసీపీలో కాంగ్రెస్ కీలక నేతల చేరిక

కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్, గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఉమ్మడి జిల్లా మాజీ ఛైర్మన్ రాం పుల్లయ్య యాదవ్, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు నరసింహులు యాదవ్ తమ అనుచరగణంతో వైసీపీలో చేరారు. తాడేపల్లిలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుర్చుకున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి జగన్ సూచించారు. జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఉన్నారు.
News September 25, 2025
క్విజ్ పోటీల్లో పాల్గొనండి: కలెక్టర్

జిల్లా యువజన సంక్షేమ శాఖ-సెట్కూరు ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్(VBYLD) క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.సిరి తెలిపారు. ఈ క్విజ్‌లో 15-29 ఏళ్ల యువత ఉచితంగా పాల్గొనవచ్చన్నారు. జాతీయ యువజన ఉత్సవం-2026లో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు అక్టోబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో జరుగుతాయన్నారు. తెలుగు సహా 12 భాషల్లో బహుళైచిక ప్రశ్నల రూపంలో నిర్వహించనున్నట్లు వివరించారు.