News September 25, 2025
విశాఖ: ‘వాహన మిత్ర దరఖాస్తుల గడువు పెంచాలి’

వాహన మిత్ర దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంచాలని ఆటో వర్కర్స్ సమాఖ్య విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవింద్ కోరారు. ఈనెల 24న దరఖాస్తుల స్వీకరణను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిందన్నారు. సర్వర్ సమస్య సాకుతో సచివాలయాల్లో చాలా దరఖాస్తులు స్వీకరించలేదన్నారు. దీనివల్ల చాలా ఉంది ఆటో డ్రైవర్లు నష్టపోయి అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం గడువు పెంచి అందరి నుండి దరఖాస్తులు స్వీకరించాలని కోరారు.
Similar News
News September 27, 2025
విశాఖ: ‘స్కానింగ్ కేంద్రాల్లో 5% ఉచితంగా వైద్య సేవలు అందించాలి’

విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం జిల్లా స్థాయి అడ్వైజర్ కమిటీ సమావేశం నిర్వహించారు. స్కానింగ్ కేంద్రాలు తనిఖీ చేయాలని, డాక్టర్ల విద్యార్హతలు, సెంటర్ డాక్యుమెంట్స్ పరిశీంచాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని స్కానింగ్ కేంద్రాల్లో 5% ఉచితంగా వైద్య సేవలు అందించాలన్నారు. ఆ వివరాలు జిల్లా వైద్య అధికారికి అందజేయాలన్నారు.
News September 26, 2025
జీఎస్టీ లబ్ధికి అక్టోబర్‌లో షాపింగ్ ఫెస్టివల్: విశాఖ కలెక్టర్

కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ప్రయోజనాలను ప్రజలకు అందించేందుకు ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. వివిధ రంగాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్‌లో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించి, జీఎస్టీ లబ్ధిని ప్రజలకు చేరవేస్తామని వివరించారు.
News September 26, 2025
ఏయూలో మెడికల్ ఆఫీసర్ ఇంటర్వ్యూలు

ఏయూలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన తాత్కాలిక నియామకాలకు పరిపాలన భవనంలో శుక్రవారం ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు 10 మందికి పైగా హాజరయ్యారు. శనివారం కూడా ఇంటర్వ్యూల ప్రక్రియ కొనసాగుతుంది. ఏయూ డిస్పెన్సరీలో కాంట్రాక్ట్ విధానంలో వీరిని నియమిస్తున్నారు.