News September 26, 2025
ఆసియాకప్ చరిత్రలోనే తొలిసారి

ఆసియా కప్ 2025లో ఫైనలిస్టులు ఖరారయ్యాయి. ఈ నెల 28న జరిగే ఫైనల్లో టీమ్‌ఇండియా, పాకిస్థాన్ తలపడనున్నాయి. 41 ఏళ్ల ఆసియాకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఎడిషన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన 2 మ్యాచుల్లోనూ పాకిస్థాన్‌ను టీమ్ ఇండియా మట్టికరిపించింది. మరోవైపు ఓవరాల్‌గా భారత్, పాక్ రెండు సార్లు(T20I WC-2007, CT 2017) ఫైనల్లో తలపడగా చెరో విజయం సాధించాయి.
Similar News
News February 10, 2026
డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ యత్నం.. ఉద్రిక్తత

HYDలో డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యాలయం ముట్టడికి బీజేపీ నేతలు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. మక్తల్‌లో ఆరో వార్డు అభ్యర్థి మహదేవప్ప <<19098651>>ఆత్మహత్య<<>> చేసుకోవడంపై కమలం నేతలు ఆందోళనకు దిగారు. అతడి మరణానికి కాంగ్రెస్ పార్టీ వేధింపులే కారణమని నిరసన చేపట్టారు. డీజీపీ ఆఫీసులోకి దూసుకెళ్లబోతుండగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
News February 10, 2026
జగన్‌కు జెడ్ ప్లస్ భద్రతను కల్పించాలి: వైసీపీ

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర హోంశాఖకు వైసీపీ లేఖ రాసింది. ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పెంచాలని విజ్ఞప్తి చేసింది. జగన్ పర్యటనల్లో పోలీసులు ఇష్టమొచ్చినట్లుగా చివరి నిమిషంలో రూట్లు మారుస్తున్నారని ఆరోపించింది. ఇటీవల తలెత్తిన భద్రతా లోపాలను ప్రస్తావిస్తూ వాటిపై విచారణ చేపట్టాలని కోరింది.
News February 10, 2026
మా ఇంధనం ఇండియా కొనకుండా US అడ్డుకుంటోంది: రష్యా

ఇండియా, ఇతర భాగస్వాములు తమ చౌకైన ఇంధనం కొనకుండా నిషేధించాలని అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా ఆరోపించింది. అధిక ధరలకు US LNGని కొనాలని బలవంతం చేస్తోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ మండిపడ్డారు. ఉక్రెయిన్‌తో సమస్య పరిష్కారానికి అమెరికా ప్రతిపాదనను తాము అంగీకరించామని, కానీ కొత్త ఆంక్షలు విధించారని విమర్శించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లు, సరఫరా మార్గాలను నియంత్రించడమే ఆ దేశ లక్ష్యమని ఫైరయ్యారు.


