News September 26, 2025

సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు

image

AP: సంచలనం రేపిన మైనర్ బాలిక సుగాలి ప్రీతి <<17594985>>కేసును<<>> రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం పవన్ ఈ కేసును పట్టించుకోవట్లేదని ప్రీతి తల్లి పార్వతి అంతకుముందు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News February 18, 2026

ఇంటర్వ్యూతో హైదరాబాద్ ECILలో ఉద్యోగాలు

image

HYDలోని <>ECIL<<>> 18 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి FEB 20న ఇంటర్వ్యూ నిర్వహించనుంది. పోస్టును బట్టి PG, PGDM(మెటీరియల్ మేనేజ్‌మెంట్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్, BE/BTech అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు (రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు). DV, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40K చెల్లిస్తారు. సైట్: www.ecil.co.in/

News February 18, 2026

రాష్ట్రంలో నేటి నుంచి శనగల కొనుగోళ్లు ప్రారంభం

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి శనగల కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. రబీలో 3.25 లక్షల హెక్టార్లలో పంట సాగవగా.. 3.77 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని ప్రభుత్వ అంచనా. కేంద్రం ఆదేశాలతో కనీస మద్దతు ధరల పథకం కింద 94,500 టన్నుల శనగలను కొనుగోలు చేయనున్నారు. పంట అమ్మకానికి అన్నదాతలు రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని, పంట కొనుగోలు చేసిన 15 రోజుల్లో నగదు చెల్లిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

News February 18, 2026

FSLలో ఉద్యోగాలపై బిగ్ అప్డేట్

image

TG: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ ఉద్యోగాలపై TSLPRB కీలక అప్డేట్ ఇచ్చింది. 3,760 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిందని, పరీక్షలకు ఎంపికైన వారి వివరాలను <>వెబ్‌సైట్లో<<>> ఉంచినట్లు తెలిపింది. అర్హత సాధించని అభ్యర్థులు ఈ నెల 21 వరకు వెబ్‌సైట్‌లో రూ.500 చెల్లించి అభ్యంతరాలు తెలపవచ్చు. MAR 5,6,7 తేదీల్లో మేడ్చల్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో పరీక్షలు జరుగుతాయి.