News September 26, 2025

శ్రీకాకుళం: 200 అడిగాడని ఇద్దరిని చంపేశాడు..!

image

కంచిలి మండలం జలంత్రకోట కూడలి వద్ద లారీ డ్రైవర్ ఇద్దరిని <<17827853>>చంపేసిన <<>>విషయం తెలిసిందే. బిహార్‌‌కు చెందిన ఇబ్రార్‌ఖాన్ న్యూ స్టార్ దాబా వద్ద లారీ ఆపి భోజనానికి వచ్చాడు. తిన్న తర్వాత రూ.200 బిల్లు కట్టకుండా వెళ్తుండగా.. దాబా యజమాని అయూబ్ అడ్డుకున్నాడు. దీంతో అతనిపైకి లారీ ఎక్కించాడు. దాబాకు పాలు పోసే దండాసి(66) సైతం డ్రైవర్‌ను అడ్డుకోవడానికి చూడగా అతని పైకీ లారీ ఎక్కించడంతో ఇద్దరూ చనిపోయారు.

Similar News

News September 27, 2025

శ్రీకాకుళం జిల్లాకు తుఫాన్ అలెర్ట్

image

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 29 వరకు తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. భారత వాతావరణశాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి శనివారం ఒడిశా – ఉత్తరాంధ్ర మద్య తీరం దాటుతుందన్నారు. గ్రామ స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని, చెట్లు కింద ఉండరాదన్నారు.

News September 27, 2025

శ్రీకాకుళంలో మీకిష్టమైన పర్యాటక ప్రదేశం ఏది ?

image

శ్రీకాకుళం జిల్లాలో పలు పర్యాటక ప్రదేశాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సుదీర్ఘ సముద్ర తీరం, నదీ పరీవాహక ప్రాంతాలు, ఎత్తైన కొండలు, పలు జలపాతాలు, విస్తారమైన వివిధ రకాల తోటలు, విదేశీ పక్షుల విడిది కేంద్రాలు, ఆధ్యాత్మిక ప్రాంతాల కలబోత మన శ్రీకాకుళం జిల్లా. ప్రభుత్వం దృష్టి సారిస్తే అనేక పర్యాటక ప్రదేశాలు నిత్యం కళకళలాడుతూ ఉంటాయి. మరి మీకు ఇష్టమైన పర్యాటక ప్రదేశం ఏది ? కామెంట్ చేయండి.

News September 27, 2025

విశాఖలో పర్యాటక ప్రదేశాలకు ఉచిత ప్రవేశం

image

VMRDA ఆధ్వర్యంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు శనివారం ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. VMRDA పార్క్, కైలాసగిరి, సెంట్రల్ పార్క్, తెలుగు మ్యూజియం, సబ్ మెరైన్ మ్యూజియం, TU-142 ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం, సీ- హారియర్ మ్యూజియం, UH3H హెలికాప్టర్ మ్యూజియంలో ఉచితం ప్రవేశం కలదు.