News September 26, 2025
చియా ఫేస్‌ప్యాక్‌తో ముఖానికి మెరుపు

ముఖంపై ముడతలు తగ్గి, అందంగా కనిపించడానికి చియాసీడ్స్ ప్యాక్ ఉపయోగపడుతుంది. చియాసీడ్స్‌ను నీటిలో లేదా కలబందగుజ్జులో పావుగంట నానబెట్టాలి. దీనికి కాస్త తేనె, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి 20 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగెయ్యాలి. ఈ మాస్క్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి, చర్మకణాల్లో కొలాజెన్‌ను పెంచుతుంది. దీనివల్ల ముఖంపై ముడతలు తగ్గి, కొత్త కాంతి వస్తుంది.
Similar News
News February 12, 2026
విటమిన్ Cతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలు

స్త్రీలకు విటమిన్ C ఎంతో ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఇది సరిగ్గా లభించకపోతే స్త్రీలకు డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. C విటమిన్‌తో కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి, ప్రెగ్నెన్సీలో తీసుకుంటే శిశువులో పుట్టుకలోపాలు రాకుండా ఉంటాయి, ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల హార్మోన్ సమస్యలు, గర్భాశయ సమస్యలు ఉండవు. కాబట్టి ఇది తగినంత అందేలా చూసుకోవాలంటున్నారు.
News February 12, 2026
చేతులు, కాళ్లు కట్టేసి.. బంగ్లాలో హిందూ యువకుడి హత్య

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతడిని మౌల్విబజార్‌లోని చంపా ప్రాంతంలో టీ తోటల్లో పని చేసే రతన్ సహువాకర్(28)గా గుర్తించారు. రతన్ చేతులు, కాళ్లు కట్టేశారని, శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని తెలుస్తోంది. రక్తపు మడుగులో ఉన్న డెడ్ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో హత్య జరిగిందా, ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
News February 12, 2026
ఎవరికి ఎంత విటమిన్ C కావాలంటే?

మహిళలు విటమిన్ C ఉండే ఆహారాలను రోజూ తినాల్సి ఉంటుంది. మహిళలకు రోజుకు 75 మిల్లీగ్రాముల మోతాదులో విటమిన్ C అవసరం అవుతుంది. గర్భిణులకు 85 mg, బాలింతలకు 120 mg అవసరమని నిపుణులు చెబుతున్నారు. టమాటా, కివీ, క్యాబేజీ, నారింజ, నిమ్మ, ఉసిరి, క్యాప్సికం, అరటి పండ్లు, బెర్రీలు, పైనాపిల్, జామ, బొప్పాయి, ద్రాక్ష, దానిమ్మ, పచ్చి బటానీలు, మ్యాంగో ద్వారా విటమిన్ Cని పొందొచ్చని సూచిస్తున్నారు.


