News April 5, 2024

HYD: KCR అలా.. రేవంత్‌రెడ్డి ఇలా: రాగిడి లక్ష్మారెడ్డి 

image

BRS మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రైతుల కష్టాలను తెలుసుకోవడం కోసం మాజీ సీఎం KCR పొలం బాట పడితే.. రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియానికి వెళ్లారన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను పట్టించుకోవడానికి సమయం లేని సీఎంకు, IPL చూసేందుకు ఎలా టైం దొరికిందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. 

Similar News

News December 26, 2024

HYD: ఫిబ్రవరి 3న లక్ష డప్పుల మహాప్రదర్శన

image

ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకురావాలని 2025, ఫిబ్రవరి 3న HYDలో జరిగే వెయ్యి గొంతులు, లక్ష డప్పుల మహాప్రదర్శనను విజయవంతం చేయాలని గురువారం MRPS, MSF, MSP అనుబంధ సంఘాల కార్యవర్గ సభ్యులు కోరారు. దీనికి సంబంధించిన సమావేశాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లోతుకుంటలోని శుభశ్రీ గార్డెన్‌లో జరుగుతుందని, ముఖ్యఅతిథిగా దండోరా దళపతి మందకృష్ణ మాదిగ హాజరువుతారన్నారు.

News December 26, 2024

HYDలో పడిపోయిన పగటి ఉష్ణోగ్రతలు

image

హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బుధవారం ఆకాశంలో మబ్బులు కమ్మేసి మేఘావృతమైంది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గరిష్ఠంగా 28, కనిష్ఠంగా 19.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు పగటిపూట చలిలో మంచుతో పాటు చిరుజల్లులు కురిశాయి. ఒకేసారి వాతావరణ మార్పుతో కొంత ఆహ్లాదకరంగా కనిపించినా.. ప్రజలు చలితో గజగజ వణికిపోయారు.

News December 26, 2024

HYD బుక్ ఫెయిర్‌లో డైరెక్టర్ త్రివిక్రమ్

image

HYD ఎన్టీఆర్ స్టేడియంలో పండుగలా కొనసాగుతున్న పుస్తక ప్రదర్శనకు పుస్తకాభిమానులు తరలివస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పలు స్టాలు పరిశీలించారు. అనంతరం ఆయన రెంటాల జయదేవ రచించిన మన సినిమా ఫస్ట్ రీల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకం గురించి ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినిమా మొదటి రోజుల గురించి రాసిన పరిశోధనాత్మక పుస్తకమని తెలిపారు.