News September 26, 2025

సింగర్ మృతి.. మ్యుజీషియన్ అరెస్ట్

image

స్టార్ సింగర్ <<17761932>>జుబీన్ గార్గ్ మృతి<<>> కేసులో మ్యుజీషియన్ శేఖర్ జ్యోతి గోస్వామిని సిట్ అరెస్ట్ చేసింది. జుబీన్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో అస్సాం ప్రభుత్వం 10మందితో సిట్ ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా సింగర్ మేనేజర్ సిద్ధార్థ్‌ ఇంట్లో సిట్ దాడులు చేసిన రోజే మ్యుజీషియన్‌ను అరెస్ట్ జరిగినట్లు జాతీయ మీడియా పేర్కొంది. జుబీన్‌‌తో పాటు గోస్వామి ఘటన జరిగిన రోజు బోటులో ప్రయాణించినట్లు తెలుస్తోంది.

Similar News

News February 16, 2026

ఫిబ్రవరి 16: చరిత్రలో ఈరోజు

image

1944: భారత సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే మరణం(ఫొటోలో)
1954: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్ జననం
1956: భారత ఖగోళ శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా మరణం
1961: ఆర్థిక శాస్త్రవేత్త వాసిరెడ్డి శ్రీకృష్ణ మరణం
1964: పారిశ్రామికవేత్త, Ex MP లగడపాటి రాజగోపాల్ జననం
1985: పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు మరణం
2005: పర్యావరణ పరిరక్షణ కోసం క్యోటో ఒప్పందం అమలు

News February 16, 2026

UPI ట్రాన్సాక్షన్ రూ.1000 దాటితే ఫీజులా?

image

దేశంలో UPI వినియోగం పెరగడంతో రోజూ లక్షల సంఖ్యలో లావాదేవీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.1000 కంటే ఎక్కువ మొత్తం UPI ద్వారా చెల్లిస్తే సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తారంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. దీనిపై NPCI స్పందించింది. వ్యక్తుల మధ్య, వ్యక్తులు-వ్యాపారుల మధ్య జరిగే లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదని తెలిపింది. ఇలాంటి వార్తలను నమ్మొద్దని కోరింది.

News February 16, 2026

పాకిస్థాన్‌పై గెలుపు.. ఇండియా సరికొత్త రికార్డు!

image

T20 WCలో పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా <<19153355>>అద్భుత విజయం<<>> సాధించిన విషయం తెలిసిందే. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో ఓ జట్టుపై అత్యధిక సార్లు గెలిచిన టీమ్‌గా రికార్డు సృష్టించింది. పాక్‌తో జరిగిన 9 మ్యాచుల్లో ఏకంగా 8 సార్లు భారత్ గెలిచింది. మరే జట్టూ దరిదాపుల్లో కూడా లేదు. బంగ్లాపై ఆస్ట్రేలియా, బంగ్లాపై పాకిస్థాన్, వెస్టిండీస్‌పై శ్రీలంక, ఇంగ్లండ్‌పై వెస్టిండీస్ 6 విజయాలతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి.