News September 26, 2025

పదేళ్లు పైబడిన మామిడి చెట్టుకు వేయాల్సిన ఎరువులు

image

వచ్చే మామిడి సీజన్‌లో మంచి దిగుబడి కోసం.. పదేళ్లు పైబడిన ప్రతి మామిడి చెట్టుకు యూరియా-1కిలో, సున్నం, మెగ్నీషియం, సల్ఫర్ కలిగిన CMS ఎరువు-1 కిలో, సూపర్ ఫాస్ఫేట్-2 కిలోలు, జింకు సల్ఫేట్-250 గ్రా, పొటాష్-1 కిలో, బోరాన్ 50 నుంచి 100 గ్రాములు వేసుకోవాలి. ఈ ఎరువుల మిశ్రమాన్ని చెట్టుకు 4-5 అడుగుల దూరంలో గొయ్యితీసి వేసి, నీరు పెట్టాలి. దీని వల్ల చెట్లలో కొత్త చిగుర్లు బాగా వచ్చి పూత అధికంగా వస్తుంది.

Similar News

News February 19, 2026

383 ప్రభుత్వ కంపెనీలు.. అలా పడున్నాయి అంతే!

image

ఆదాయం లేదు.. పని లేదు, ఉన్నా అంతంతమాత్రమే. అయినా ఎప్పటికప్పుడు ఆడిట్స్ జరుగుతూ అధికారిక లెక్కల్లో ఉంటున్నాయి. దేశంలోని 383 ప్రభుత్వ రంగ సంస్థల దుస్థితి ఇది. ఈ కంపెనీలను మూసివేయాలన్నా సుదీర్ఘ లీగల్ ప్రొసీజర్, కొన్ని సంస్థలు కోర్టు కేసుల్లో ఉండటం, అసెట్‌లా వాడుకునేందుకు, రాజకీయ కారణాలతో సాధ్యం కావట్లేదు. దీంతో ట్యాక్స్ పేయర్స్‌పైన భారం పడుతోంది. అత్యధికంగా బిహార్‌లో 39 ఇనాక్టివ్ కంపెనీలు ఉన్నాయి.

News February 19, 2026

ప్రేయసితో ❤️ పెళ్లికి సిద్ధమైన ధవన్.. ఫొటోలు వైరల్

image

IND మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ ప్రేయసి సోఫీ షైన్‌(ఐర్లాండ్)తో పెళ్లికి సిద్ధమయ్యారు. నిన్న సంగీత్ వేడుకల ఫొటోలను SMలో షేర్ చేయగా వైరలవుతున్నాయి. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వివాహం జరగనున్నట్లు సమాచారం. కాగా AUSకు చెందిన ఆయేషాను ధవన్ 2012లో వివాహం చేసుకొని 2023లో విడాకులు తీసుకున్నారు.

News February 19, 2026

రూ.20 లక్షల ఉద్యోగం వస్తేనే అభిషేకం.. విద్యార్థి లేఖ వైరల్

image

AP: ఏలూరు(D) తాడువాయిలోని శ్రీభద్రకాళి వీరేశ్వరస్వామి ఆలయ హుండీలో ఓ విద్యార్థి వేసిన లేఖ వైరలవుతోంది. ఇటీవల జరిగిన పరీక్షల్లో తనకు 9CGPA మార్కులు, తర్వాత ఏడాదికి రూ.20 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చేలా చూడాలని కోరాడు. అప్పుడు అభిషేకం చేయించి బట్టలు ఇస్తానని లేఖలో పేర్కొన్నాడు. దీంతో ఈ కుర్రాడు దేవునితో డీల్ మాట్లాడుకున్నాడంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.