News September 26, 2025
రూ.3.57 కోట్లతో అనెక్స్ భవనం ప్రారంభం

AP అసెంబ్లీ ప్రాంగణంలో అనెక్స్ భవనాన్ని గురువారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు మంత్రులు పయ్యావుల, నారాయణలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియా పాయింట్లో స్పీకర్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన భవనాన్ని అన్ని హంగులతో పునరుద్ధరించేందుకు రూ.3కోట్ల 57 లక్షలతో నిర్మించడం జరిగిందని తెలిపారు. భవనం గ్రౌండ్ ప్లోర్లో మీడియా సమావేశాలకు వీలుగా సుమారు 100 మంది మీడియా ప్రతినిధులు కూర్చోవచ్చన్నారు.
Similar News
News September 27, 2025
తుళ్లూరు: 97 మందికి రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు

అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక (జరీబు, మెట్ట), మల్కాపురం(ప్రత్యామ్నాయ ప్లాట్లు) గ్రామాల రైతులకు శుక్రవారం విజయవాడలోని CRDA కార్యాలయంలో ఈ- లాటరీ విధానంలో 97 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 41 నివాస ప్లాట్లు కాగా 36 వాణిజ్య ప్లాట్లు, 20 ప్రత్యామ్నాయ ప్లాట్లు మొత్తం 56 మంది రైతులు, భూయజమానులకు ప్లాట్లను కేటాయించడం జరిగిందన్నారు. CRDA స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులున్నారు.
News September 27, 2025
గుంటూరు జిల్లాలో వర్షం

వాయువ్య,దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నాటికి కృష్ణానది వరద ప్రకాశం బ్యారేజి వద్ద 2.39 లక్షల క్యూసెక్కులు, ఉందని తెలిపారు. శనివారం గుంటూరు, పల్నాడులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.
News September 27, 2025
అతిసార వ్యాధి నియంత్రణలో ఉంది: కలెక్టర్

గుంటూరు జిల్లాలో అతిసార వ్యాధి నియంత్రణలో ఉందని కలెక్టర్ ఎం. తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. జిల్లాలో మొత్తం 177 కేసులు నమోదయ్యాయని, వాటిలో 152 కేసులు గుంటూరు పట్టణం నుంచి, 25 కేసులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాయని ఆమె వివరించారు. ఈ వ్యాధిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారన్నారు.