News September 26, 2025
టారిఫ్స్ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన ఫార్మా షేర్లు

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. US ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా ప్రొడక్ట్స్‌పై 100% టారిఫ్స్ విధించనున్నట్లు ప్రకటించడంతో ఫార్మా కంపెనీల షేర్లు దాదాపు 4% మేర నష్టపోయాయి. సెన్సెక్స్ 381 పాయింట్ల నష్టంతో 80,778, నిఫ్టీ 111 పాయింట్లు కోల్పోయి 24,779 వద్ద ట్రేడవుతున్నాయి. సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, HCL టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Similar News
News February 15, 2026
మాస శివరాత్రి, మహా శివరాత్రి.. తేడాలేంటి?

ప్రతి నెలా కృష్ణ పక్ష చతుర్దశి నాడు వచ్చేది మాస శివరాత్రి. మాఘ మాసంలో వచ్చేది మహా శివరాత్రి. ఏడాదికి 12 మాస శివరాత్రులు వస్తాయి. మహా శివరాత్రి ఒక్కసారే వస్తుంది. మాస శివరాత్రి మనశ్శాంతి, పాపక్షయం కోసం జరుపుకొంటారు. శివుడు లింగోద్భవమైన, శివపార్వతుల కళ్యాణం జరిగిన మహా శివరాత్రిని అత్యంత విశేషంగా జరుపుకొంటారు. రెండింటిలోనూ ఉపవాసం, జాగారం, అభిషేకాలు ప్రధానమే. అయితే మహా శివరాత్రి అత్యున్నతమైనది.
News February 15, 2026
ఘోరం.. 46 మందిని చంపేశారు!

నైజీరియాలో దారుణం జరిగింది. ISISతో సంబంధమున్న సాయుధ బందిపోట్లు మూడు గ్రామాల్లో అరాచకం సృష్టించారు. 40కి పైగా మోటార్ సైకిళ్లపై తిరుగుతూ కనిపించిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కొందరి గొంతులను నరికేశారు. ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ దాడుల్లో 30 నుంచి 46 మంది చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కాగా ఈ నెల 3న కూడా ఇలాంటి తరహా దాడుల్లో 162 మంది <<19053687>>మృతి చెందిన<<>> విషయం తెలిసిందే.
News February 15, 2026
BIG DAY: రేపే మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక

TG: ‘పుర’ పోరు చివరి అంకానికి చేరుకుంది. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లలో గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు రేపు 11AMకు ప్రమాణం చేయనున్నారు. అనంతరం మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్, మేయర్, డి.మేయర్ ఎన్నిక ప్రారంభమవుతుంది. కౌన్సిలర్లు, కార్పొరేటర్లలో సగం మంది హాజరైతేనే కోరం ఉన్నట్లు పరిగణించి చేయి ఎత్తే విధానంలో అధికారులు ఎన్నిక పూర్తిచేస్తారు. లేదంటే మరో రోజుకు వాయిదా వేస్తారు.


