News April 5, 2024

HYD: పోలీసుల తనిఖీలో రూ.40 లక్షలు పట్టివేత

image

హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణ థియేటర్ వద్ద పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా ఓ కారును ఆపి తనిఖీ చేయగా కారులో నుంచి రూ.40 లక్షలు నగదు బయటపడింది. ఇద్దరు వ్యక్తుల వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేసి, నగదును సీజ్ చేసినట్లు అబిడ్స్ పోలీసులు తెలిపారు.

Similar News

News July 5, 2025

HYD: హెక్టార్‌లో 2 టన్నుల కంది దిగుబడి

image

గరిష్ఠ ఉష్ణోగ్రతలు తట్టుకొని, ఒక హెక్టార్‌లో 2 టన్నులు దిగుబడి ఇచ్చే కంది వంగడాన్ని ICPV 25444 పేరుతో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 45 డిగ్రీల సెల్సియ ఉష్ణోగ్రతల వద్ద సైతం ఇది తట్టుకుంటుంది. 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఖరీఫ్ రబీ సీజన్‌లో ఎప్పుడైనా పంట పండించవచ్చు. తాండూరు, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాలు ఈ పంట రకానికి అనుకూలమని అధికారులు డైరెక్టర్ హిమాన్షు తెలిపారు.

News July 5, 2025

HYD: GHMC వెబ్‌సైట్‌లో ఈ సదుపాయాలు

image

ఆస్తి పన్నుకు సంబంధించి ప్రజల సౌకర్యార్థం కొన్ని సదుపాయాలను GHMC వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్, రివిజన్, వేకెన్సీ రెమిషన్, యజమాని పేరు కరెక్షన్, డోర్ నెంబర్ కరెక్టన్, అసెస్ మెంట్ మినహాయింపు, ప్రాపర్టీ టాక్స్ సెల్ఫ్ అసెస్మెంట్ ఉన్నాయన్నారు. ప్రజలు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు.

News July 5, 2025

రాజేంద్రనగర్: 8 నుంచి డిప్లొమా కోర్సుల కౌన్సిలింగ్

image

ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 8 నుంచి 11 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా.విద్యాసాగర్ తెలిపారు. కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థుల ర్యాంకుల వివరాలు, ఆయా తేదీలు కోసం వెబ్ సైట్‌ను చూడాలన్నారు. ఈ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు కోర్సులకు సంబంధిత ఫీజును తీసుకురావాలని సూచించారు.