News September 26, 2025
వైన్స్ టెండరా? ఎలక్షన్ నామినేషనా?.. లెక్కేత్తున్నారయ్యో!

TG పల్లెల్లో పొలిటీషియన్స్ డైలమాలో పడ్డారు. ఓవైపు వైన్స్ టెండర్ల ప్రకటన వచ్చింది. మరోవైపు రేపోమాపో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. దీంతో లాస్ అంటూ ఉండని, ‘పైసా’ వచ్చే వైన్స్ కోసం డబ్బు పెట్టాలా? లేక లోకల్ పోరులో గెలిస్తే వచ్చే ‘పవర్&పైసా’ వైపు మొగ్గాలా? అని లెక్కలేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే పోటీకి సై అంటూనే కనీసం ఓ షాపుకైనా టెండర్ వేయాలని మనీ సెట్ చేసుకుంటున్నారు.
Similar News
News January 23, 2026
రాహుల్, థరూర్ మధ్య ముదిరిన విభేదాలు?

రాహుల్ గాంధీపై శశి థరూర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొచ్చిలో జరిగిన సమావేశంలో వేదికపై తన పేరును రాహుల్ కావాలనే ప్రస్తావించలేదని థరూర్ నొచ్చుకున్నట్లు సమాచారం. దీంతో కేరళ ఎన్నికల సన్నద్ధతపై నేడు నిర్వహించనున్న కీలక సమావేశానికి ఆయన డుమ్మా కొట్టనున్నట్లు తెలుస్తోంది. గతంలో PM మోదీని పొగిడారనే కారణంతో పార్టీ నాయకత్వం థరూర్‌ను పక్కన పెడుతోందన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
News January 23, 2026
వంటింటి చిట్కాలు

* పూరీలు తెల్లగా ఉండాలంటే వేయించే నూనెలో రెండు జామాకులు వేసి వేయించాలి.
* పకోడీ, జంతికల పిండిలో పాలు పోస్తే కరకరలాడతాయి.
* ఇడ్లీ, దోశకు బియ్యం నానబెట్టే ముందు కాస్త వేయించాలి. ఇలా చేస్తే ఇడ్లీ మెత్తగా, దోశలు కరకరలాడుతూ ఉంటాయి.
* బంగాళదుంపలతో కలిపి నిల్వ చేస్తే వెల్లుల్లి చాలా కాలం తాజాగా ఉంటాయి.
* అప్పడాలు, వడియాలు వేయించే ముందు కాసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి.
News January 23, 2026
859 పోస్టులు.. రేపటి నుంచే దరఖాస్తులు

TG: రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 859 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి(24వ తేదీ) నుంచి ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, Jr.అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్ తదితర పోస్టులకు ఏడో తరగతి-డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. 18-46 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://tshc.gov.in


