News September 26, 2025

త్వరలో అసెంబ్లీలో AI ఆధారిత హాజరు!

image

AP: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో AI ఆధారిత హాజరు విధానం ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. కొద్దిరోజులుగా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. DECలో జరిగే శీతాకాల సమావేశాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. సభ్యులు హాజరు పట్టికలో సంతకం చేసి వెళ్తుండటంతో కచ్చితత్వం లోపిస్తోందని, దుర్వినియోగం జరుగుతోందన్న విమర్శలకు దీంతో చెక్ పెట్టనుంది. AI సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే కెమెరాలు సభ్యుల వివరాలను నమోదు చేస్తాయి.

Similar News

News February 10, 2026

బాబ్రీ మసీదు నిర్మాణం జరగదు: UP CM యోగి

image

బాబ్రీ మసీదు నిర్మాణం ఎప్పటికీ జరగదని UP CM యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ‘రామ్ లల్లా కోసం వస్తామని, ఆలయం నిర్మిస్తామని చెప్పాం. మాట నిలబెట్టుకున్నాం. ఖయామత్ దినం రాదనేది నిజం. అలాంటప్పుడు బాబ్రీ నిర్మాణం ఎలా జరుగుతుంది? దాని గురించి కలలు కనొద్దు’ అని బారాబంకి సభలో అన్నారు. WB ముర్షిదాబాద్‌లో బాబ్రీ తరహా మసీదు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ లక్నో నుంచి మార్చ్ చేయనున్నట్టు హిందూ సంస్థలు ప్రకటించాయి.

News February 10, 2026

వాస్తుకు లేని స్థలాల్లో ఇల్లు కట్టుకోవచ్చా ?

image

వాస్తు లేని స్థలంలో ఇల్లు కట్టాల్సి వస్తే, రోడ్డును బట్టి సరైన ప్లాన్ రూపొందించుకోవాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘ఇంటి చుట్టూ 4 వైపులా ఖాళీ స్థలం వదలాలి. గాలి, వెలుతురు ప్రతి గదిలోకి ప్రవహించేలా చూసుకోవాలి. నీటి వసతికి ప్రాధాన్యతనిస్తూ జాగ్రత్తగా నిర్మించుకోవాలి. వీటితో ఇంటికి జీవశక్తి పెరుగుతుంది. ఆందోళన అనవసరం. ప్రాథమిక సూత్రాలు పాటించడమే అసలైన వాస్తు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 10, 2026

కొడుకు పెళ్లికి రావాలని మోదీకి సచిన్ ఆహ్వానం

image

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుటుంబంతో PM మోదీని కలిశారు. Mar 5న జరగనున్న కొడుకు అర్జున్ పెళ్లికి ఆయనను ఆహ్వానించినట్లు SMలో సచిన్ తెలిపారు. ‘అర్జున్, సానియా చందోక్ పెళ్లికి మోదీని ఆహ్వానించడం గర్వంగా ఉంది. యంగ్ కపుల్‌ను ఆశీర్వదించి, విలువైన సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. అనంతరం ఢిల్లీ 10 జన్‌పథ్‌లోని నివాసంలో సోనియా గాంధీని కలిసి పెళ్లి వేడుకకు ఆహ్వానించారు.