News September 26, 2025

పత్తి కొనుగోళ్లు – ప్రభుత్వ మార్గదర్శకాలు(2/2)

image

AP: పత్తి రైతుల కుటుంబ సభ్యుల గుర్తింపునకు రేషన్‌కార్డు డేటాను CMయాప్‌నకు అనుసంధానించాలని పౌర సరఫరాలశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఆధార్‌ లింక్ చేసిన రైతుల బ్యాంక్‌ అకౌంట్‌కు CCI నగదు చెల్లింపులు జరపాలి. పత్తి విక్రయ వివరాలు నమోదు సమయంలో ఆధార్‌, పట్టాదారు పాసుపుస్తకం ఫొటో కాపీలను రైతులు తీసుకురావాలి. పత్తి రవాణా వివరాలను యాప్‌లో నమోదు చేసి, రవాణాదారులకు చెల్లింపులు జరపాలని ప్రభుత్వం పేర్కొంది.

Similar News

News February 19, 2026

మార్చి 15లోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ: టీపీసీసీ చీఫ్

image

TG: వచ్చే నెల 15వ తేదీలోగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఢిల్లీలో AICC పెద్దలతో రాష్ట్ర మంత్రులు, కీలక నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మున్సిపల్ ఎన్నికలపై పార్టీ అధిష్ఠానం సంతృప్తి వ్యక్తం చేసింది. రాజగోపాల్ రెడ్డి అంశంపైనా చర్చించాం. త్వరలో ఆయనతో మాట్లాడతాం. రాజ్యసభ అభ్యర్థులపై 2 రోజుల్లో మళ్లీ చర్చలు జరుగుతాయి’ అని వెల్లడించారు.

News February 19, 2026

608 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (<>HPCL<<>>)608 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్(సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్)అర్హత గలవారు MARCH 2 వరకు NATS 2.0 పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18-25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.25,000 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.hindustanpetroleum.com

News February 19, 2026

సెన్సెక్స్ 750 పాయింట్లు డౌన్.. కారణాలివే

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లోకి కూరుకుపోయాయి. మూడు రోజుల వరుస లాభాల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ఆయిల్ ధరల పెరుగుదల వంటివి సూచీలను కిందకు లాగాయి. సెన్సెక్స్ 759 పాయింట్లు పతనమై 82,974 వద్ద, నిఫ్టీ 211 క్షీణించి 25,607 దగ్గర కొనసాగుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో ఇన్ఫీ, TCS షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. KWIL, ట్రెంట్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.