News September 26, 2025

పరిమళ ద్రోహం అంటే ఏమిటి?

image

తిరుమలలో పుష్పాలను స్వామి వారికి సమర్పించకుండా అలంకరించుకుంటే అది పరిమళ ద్రోహమే అవుతుందట. పూర్వం శ్రీశైల పూర్ణుని శిష్యుడొకరు తిరుమలలో శ్రీనివాసునికి సమర్పించని పుష్పమాలను తన తలపై ధరించి ఆనందించారు. ఆ రోజు రాత్రి శ్రీశైల పూర్ణుని కలలో స్వామివారు నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడని చెప్పారట. అప్పటి నుంచి తిరుమలలో ఎవరూ పుష్పాలు ధరించరాదనే కట్టడి చేశారని పురాణ కథనాలు చెబుతున్నాయి.
<<-se>>#VINAROBHAGYAMU<<>>

Similar News

News February 17, 2026

బంగ్లా క్యాబినెట్‌లో ఏకైక హిందూ మంత్రి.. నితాయ్ రాయ్ చౌధరీ!

image

బంగ్లా కొత్త ప్రధాని తారిఖ్ రెహమాన్ మంత్రివర్గంలో హిందూ సామాజిక వర్గానికి చెందిన నితాయ్ రాయ్ చౌధరీకి స్థానం దక్కింది. ఆయన సాంస్కృతిక శాఖ బాధ్యతలు చేపట్టారు. మాగురా-2 నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించిన రాయ్ వృత్తిరీత్యా లాయర్. BNP వైస్ ఛైర్మన్లలో ఒకరు. 1990లో హుస్సేన్ ఎర్షద్ ప్రభుత్వంలోనూ మంత్రిగా చేశారు. హిందువులపై దాడుల నేపథ్యంలో మంత్రివర్గంలో ఆయన చేరిక ప్రాధాన్యం సంతరించుకుంది.

News February 17, 2026

పాకిస్థాన్‌కు ‘రావి’ షాక్: ఏప్రిల్ నుంచి నీళ్లు బంద్!

image

వేసవి వేళ పాక్‌కు భారత్ షాకివ్వనుంది. రావి నదిపై నిర్మిస్తున్న షాపూర్ కండి బ్యారేజ్ మార్చి 31 నాటికి పూర్తి కానుంది. దీంతో ఏప్రిల్ నుంచి పాక్‌కు వెళ్లే మిగులు జలాలను పూర్తిగా నిలిపేయనున్నట్లు JK మంత్రి జావెద్ అహ్మద్ ప్రకటించారు. 1960 ఒప్పందం ప్రకారం ఈ నదిపై భారత్‌కే పూర్తి హక్కులు ఉన్నా ఇన్నాళ్లూ ప్రాజెక్టుల్లేక నీరు వృథాగా పాక్‌కు వెళ్లేది. ఇకపై ఆ నీటితో JK, పంజాబ్‌లకు సాగునీరు అందనుంది.

News February 17, 2026

రేపటి నుంచి శనగల కొనుగోళ్లు.. 15 రోజుల్లో డబ్బులు: మంత్రి

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి శనగల కొనుగోళ్లను ప్రారంభిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులు తమ పంటను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. CM APP ద్వారా షెడ్యూల్ ప్రకారం కొనుగోళ్లు చేపడతామన్నారు. 15 రోజుల్లోపు అన్నదాతల అకౌంట్లకే డబ్బులు జమ చేస్తామని భరోసా ఇచ్చారు. కాగా 2026-27 రబీ సీజన్‌కు కేంద్రం క్వింటాకు రూ.5,875 మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే.