News September 26, 2025

SKLM: ‘జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి’

image

ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మారిన జీఎస్టీపై ప్రభుత్వ శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలసి ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. మారిన ధరల విషయంపై ప్రజలకు తెలియజేయాలన్నారు. 4 వారాల షెడ్యూల్‌ను సవివరంగా ప్రజలకు తెలియజేయాలన్నారు.

Similar News

News September 27, 2025

విశాఖలో పర్యాటక ప్రదేశాలకు ఉచిత ప్రవేశం

image

VMRDA ఆధ్వర్యంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు శనివారం ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. VMRDA పార్క్, కైలాసగిరి, సెంట్రల్ పార్క్, తెలుగు మ్యూజియం, సబ్ మెరైన్ మ్యూజియం, TU-142 ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం, సీ- హారియర్ మ్యూజియం, UH3H హెలికాప్టర్ మ్యూజియంలో ఉచితం ప్రవేశం కలదు.

News September 27, 2025

SKLM: లుక్ ఎట్ టుడే టాప్ న్యూస్

image

♦︎ పాతపట్నం: రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం
♦︎ జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్
♦︎1998 డీఎస్సీ టీచర్ల సమస్యలపై మాట్లాడిన ఎమ్మెల్యే కూన రవి
♦︎ సీఎంను కలిసిన ఎమ్మెల్యే గౌతు శిరీష
♦︎ శ్రీకాకుళంలో ముసురు వాతావరణం
♦︎ ఆధునిక సాంకేతికతో కొత్తమ్మతల్లి ఉత్సవాలు: SP
♦︎ టెక్కలి: చక్రం కదలదు.. వాహనం ముందుకెళ్లదు

News September 26, 2025

శ్రీకాకుళం జిల్లాకు రెడ్ అలర్ట్

image

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న రెండు గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్లు, శిథిల భవనాలు వద్ద ఉండరాదని, సురక్షితప్రాంతాల్లో ప్రజలు ఉండాలని సూచించింది.