News April 6, 2024
ఈనెల 8న అచ్యుతాపురంలో వారాహి యాత్ర

అచ్యుతాపురంలో ఈనెల 8వ తేదీన నిర్వహించే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను విజయవంతం చేయాలని ఎలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్, టిడిపి ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరావు పిలుపునిచ్చారు. మండలంలో లాలం కోడూరు గ్రామంలో వారు మాట్లాడుతూ.. అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ఈ సభకు హాజరుకావాలని కోరారు. జనసేన- బీజేపీ- టీడీపీలకు చెందిన వారందరూ పాల్గొంటారని తెలిపారు.
Similar News
News September 10, 2025
గాజువాక: మేడ మీద నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

మానసిక అనారోగ్య కారణాలతో వివాహిత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వడ్లపూడికి చెందిన ప్రత్యూషకు రాంబిల్లికి చెందిన సతీశ్‌తో వివాహం కాగా కూర్మన్నపాలెంలోని అద్దెకి ఉంటున్నారు. మానసిక ఒత్తిడి, నిద్రలేమితో బాధపడుతున్న ఆమె ఆత్మహత్య చేసుకుందని దువ్వాడ సిఐ మల్లేశ్వరరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 10, 2025
అక్రమ నిర్మాణాలకు ఎన్వోసీ ఇవ్వద్దు: జీవీఎంసీ కమిషనర్

నగరంలోని జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలకు ఎన్వోసీ సర్టిఫికెట్ జారీ చేయవద్దని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జోన్ ఫోర్లో జరిగిన సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొనగా అక్రమ నిర్మాణాలు ఎన్ని జరుగుతున్నాయి. ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారు ఏసీపీ ఝాన్సీ లక్ష్మీని అడిగారు. జీవన్‌సి ఆర్థిక పరిపుష్టి సాధించే ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. జోనల్ కమిషనర్ పాల్గొన్నారు.
News September 9, 2025
ఆంధ్ర ఉమెన్ టీ20 క్రికెట్ లీగ్ విజేత విజయవాడ బ్లాస్టర్స్

విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర ఉమెన్ టీ20 క్రికెట్ లీగ్ 2025లో విజయవాడ బ్లాస్టర్స్ విజేతగా నిలిచింది. ఫైనల్లో రాయలసీమ రాణీస్‌పై 13 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీ దక్కించుకుంది. మేఘన – 49, మహంతి శ్రీ – 37, రంగ లక్ష్మి – 33 పరుగులతో రాణించారు. బౌలింగ్‌లో రిషిక కృష్ణన్ 3 వికెట్లు తీసింది. మిథాలీ రాజ్ చేతుల మీదుగా జట్టు రూ.6 లక్షల ప్రైజ్ మనీతో ట్రోఫీ అందుకుంది.