News September 27, 2025
PHOTOS: వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ముత్యపుపందిరి వాహనంపై మలయప్ప స్వామి ఉభయదేవేరులతో ఊరేగారు. తెల్లటి ముత్యాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన వాహనంలో ఆసీనులై శ్రీకృష్ణుడి అవతారంలో రుక్మిణీ సత్యభామతో కలిసి భక్తులకు అభయమిచ్చారు. 10 రాష్ట్రాల నుంచి వచ్చిన 482 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. తెలంగాణ నుంచి వచ్చిన బృందం లంబాడీ నృత్యంతో అలరించింది.
Similar News
News February 8, 2026
సంక్రాంతి రేసులో టాలీవుడ్ ‘ఫోర్ పిల్లర్స్’!

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ను టాలీవుడ్‌కి నాలుగు పిల్లర్లుగా చెబుతుంటారు. వచ్చే సంక్రాంతికి వీరంతా బాక్సాఫీసు వద్ద పోటీ పడేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. చిరు-బాబీ, బాలయ్య-గోపీచంద్ మలినేని, నాగార్జున-కళ్యాణ్ కృష్ణ, వెంకటేశ్-అనిల్ రావిపూడి సినిమాలు పొంగల్ పోరుకు రెడీ అవుతున్నాయి. మరి వీటిలో ఏ పుంజు చివరి వరకు బరిలో ఉంటుంది? ఏది రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
News February 8, 2026
మీకు PMJDY అకౌంట్ ఉందా?

అందరికీ బ్యాంక్ సేవలు అందాలనే ఉద్దేశంతో కేంద్రం 2014లో PM జన్ ధన్ యోజన(PMJDY) తీసుకొచ్చింది. బ్యాంకు ఖాతాలు లేని వారు ఏదైనా బ్యాంకులో PMJDY అకౌంట్‌ను ఓపెన్ చేయొచ్చు. దీనికి మినిమమ్ బ్యాలన్స్ మెయింటైన్ చేయాల్సిన పనిలేదు. రూపే డెబిట్ కార్డు, డిపాజిట్స్‌పై ఇంట్రెస్ట్, ₹2లక్షల ప్రమాద బీమా, ₹10వేల వరకు లోన్ వెసులుబాటు ఉంటుంది. DBT, ముద్ర, పెన్షన్ స్కీములకూ ఈ ఖాతా పనిచేస్తుంది. వివరాలకు <
News February 8, 2026
నిద్ర ఎక్కువైనా ప్రమాదమే!

* ఎక్కువ సమయం నిద్రపోతే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
* ఇన్సులిన్‌ను నియంత్రించే హార్మోన్లపై ప్రభావం పడుతుంది.
* మహిళల్లో సంతానోత్పత్తి సమస్య వచ్చే ప్రమాదం ఉంది.
* కండరాలు, నరాలు సంకోచించి శారీరకంగా అలసిపోతారు.
* తలనొప్పి, వెన్నునొప్పి వస్తాయి. డిప్రెషన్‌కు గురవుతారు.
* అలసట, నీరసంగా అనిపించి జంక్‌ఫుడ్/అధిక కేలరీలున్న ఫుడ్ తినడంతో బరువు పెరిగే ప్రమాదం ఉంది.


