News September 27, 2025
చుక్కలు చూపిస్తున్న శ్రీలంక బ్యాటర్లు

ASIA CUP-2025: భారత్‌తో జరుగుతోన్న మ్యాచులో శ్రీలంక బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక దూకుడుగా ఆడుతోంది. 9 ఓవర్లలోనే 103/1 రన్స్ చేసింది. నిస్సాంక (51*), కుశాల్ పెరీరా (51*) సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతున్నారు. శ్రీలంక విజయానికి 66 బంతుల్లో 100 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
Similar News
News February 16, 2026
JEE ఫలితాలు వచ్చేశాయ్

జేఈఈ-2026 ఫలితాలు విడుదలయ్యాయి. దేశంలోని NITలు, ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల కోసం జనవరి 21 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించారు. దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఏపీకి చెందిన నరేంద్రబాబు, పసల మోహిత్, తెలంగాణకు చెందిన వివన్ శరద్ మహిశ్వరికి 100 పర్సంటైల్ వచ్చింది. రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు <
News February 16, 2026
హార్మోన్లు సమతుల్యంగా ఉండాలంటే ఇవి తినాలి

హార్మోన్లను సమన్వయం చేయాలంటే పిండిపదార్థాలు, మాంసకృత్తులు, మంచి కొవ్వులు కలగలిసిన పోషకాహారాన్ని తీసుకోవాలి. అవకాడో, ఆలివ్ నూనెలు తీసుకోవాలి. రోజూ రెండు తెల్లగుడ్డుసొనలు, వాల్ నట్స్ తీసుకోవాలి. గుమ్మడి, అవిసె, పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులను రోజూ తినడం వల్ల హార్మోన్ల పనితీరు మెరుగవుతుంది. హార్మోన్ల మెటబాలిజానికి కాలేయానిదే ప్రధాన పాత్ర. రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల ఇది డీటాక్స్ అవుతుంది.
News February 16, 2026
పెళ్లికి ముందు శృంగారం.. జాగ్రత్తగా ఉండండి: సుప్రీంకోర్టు

వివాహానికి ముందు యువతీయువకులు శారీరక సంబంధం పెట్టుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని, ఎవరినీ నమ్మొద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. పెళ్లి హామీతో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ కామెంట్లు చేసింది. ‘మేం పాత తరం వాళ్లం. ఇప్పటి తరం పెళ్లికి ముందు ఎందుకు ఫిజికల్ రిలేషన్‌లోకి వెళ్తోందో అర్థం చేసుకోలేకపోతున్నాం’ అని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ పేర్కొన్నారు.


