News September 27, 2025

ALERT.. వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

image

AP: వాయవ్య, మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు APSDMA వెల్లడించింది. ఇవాళ తెల్లవారుజామున దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో కృష్ణా, NTR, GNT, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది.

Similar News

News February 15, 2026

అమెరికన్ ప్లేయర్స్‌కు చైనా సీక్రెట్‌గా ₹116 కోట్లు!

image

USలో పుట్టి చైనా తరఫున ఆడుతున్న స్టార్ స్కీయర్ ‘ఐలీన్ గూ’, మరో ప్లేయర్ ‘జూ యీ’కు డ్రాగన్ దేశం రహస్యంగా 3ఏళ్లలో ₹116 కోట్లు చెల్లించినట్లు WSJ పేర్కొంది. ద్వంద్వ పౌరసత్వంపై విమర్శలు రాకుండా, విదేశీ క్రీడాకారులకు భారీ నిధులు ఇస్తున్నారన్న ప్రజల అసంతృప్తిని తొక్కేయడానికి అధికారులు ఆమె పేరును బడ్జెట్ రికార్డుల నుంచి తొలగించారు. నేషనల్ ప్రెస్టీజ్ కోసమే చైనా ఇంతలా ఖర్చు చేస్తోందనే వాదన వినిపిస్తోంది.

News February 15, 2026

ఏపీలో రేపు ఆప్షనల్ హాలిడే.. తెలంగాణలో నో

image

ఈసారి శివరాత్రి ఆదివారం రావడంతో పబ్లిక్ హాలిడే అదే రోజు వర్తిస్తుంది. అయితే ఉద్యోగులు జాగరణ చేసి తర్వాతి రోజు డ్యూటీ చేయడం కష్టమని ఏపీ ప్రభుత్వం సోమవారం <<19142894>>ఆప్షనల్ హాలిడే<<>> ఇచ్చింది. దీంతో కొందరు ఉద్యోగులు సెలవు తీసుకునే అవకాశం ఉంది. స్కూళ్లు మాత్రం యథావిధిగా నడవనున్నాయి. అటు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సెలవు (ఆప్షనల్ సహా) ప్రకటించలేదు.

News February 15, 2026

నరనారాయణులు ఎవరు?

image

మహావిష్ణువు కవల అవతారాలే నరనారాయణులు. వీరు లోక కల్యాణం కోసం బదరీ క్షేత్రంలో కఠోర తపస్సు చేశారు. వీరే కృష్ణార్జునులుగా జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. సహస్ర కవచాంతకుడనే రాక్షసుడిని సంహరించడానికి ఒకరు తపస్సు, మరొకరు యుద్ధం చేస్తూ వేల ఏళ్లు పోరాడారు. వీరు బదరీ వృక్షం కింద నివసించడం వల్లే శివరాత్రి నాడు ఆ పండ్లను నైవేద్యంగా పెట్టే సంప్రదాయం ఏర్పడింది. వీరు జ్ఞానానికి, తపస్సుకు నిలువెత్తు రూపాలు.