News September 27, 2025
నా బయోపిక్ ఆ డైరెక్టరే తీయాలి: మనోజ్

‘మిరాయ్’ సక్సెస్ జోష్‌లో ఉన్న నటుడు మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తన బయోపిక్ తీస్తే దానికి సందీప్ రెడ్డి వంగా మాత్రమే దర్శకత్వం వహించాలని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే తాను వైల్డెస్ట్ యానిమల్ అంటూ ఓ పాడ్ కాస్ట్‌లో చెప్పారు. ‘మిరాయ్’ హీరో తేజా సజ్జతో తనకు ఎలాంటి గొడవలు లేవని చెప్పారు. ప్రస్తుతం ‘డేవిడ్ రెడ్డి’తో పాటు మరో చిత్రంలో మనోజ్ నటిస్తున్నారు.
Similar News
News February 11, 2026
పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.
News February 11, 2026
వివాహ దోషాలకు పరిష్కారం స్వయంవర పార్వతీ మంత్రం

అన్ని అర్హతలున్నా పెళ్లి సంబంధాలు సెట్ కానప్పుడు స్వయంవర పార్వతీ మంత్రం పఠించాలని పండితులు చెబుతున్నారు. ‘శివుడిని భర్తగా పొందడానికి పార్వతీ దేవి ఈ మంత్రం జపించిందని పురాణాల వాక్కు. నిష్ఠతో ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపిస్తే జాతక దోషాలు హరిస్తాయి. అమ్మవారికి పసుపు, కుంకుమలతో పూజ చేస్తే కళ్యాణ యోగం వస్తుంది. ఈ సాధన మనసులో ధైర్యాన్ని నింపి త్వరగా పెళ్లి జరిగేలా చేస్తుంది’ అని సూచిస్తున్నారు.
News February 11, 2026
KCR కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్‌కు ఉందా: బండి సంజయ్

TG: KCR కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము CM రేవంత్‌కు ఉందా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఆయనకు చేతకాదని చెబితే ఆ సంగతి కేంద్రం చూసుకుంటుందని KNR ప్రెస్‌మీట్‌లో స్పష్టం చేశారు. ‘రేవంత్ CM కాకముందు తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పారు. నిన్న వాళ్ల మంత్రి ఇప్పటికీ తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందన్నారు. మరి ట్యాపింగ్ ఎవరు చేస్తున్నట్లు? CM చేస్తున్నారా? BRS వాళ్లు చేస్తున్నారా?’ అని వ్యాఖ్యానించారు.


