News September 27, 2025

కాత్యాయని రూపంలో అమ్మవారు: ఉత్తమ సంతానం కోసం ఈ మంత్రం

image

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి నేడు కాత్యాయనీ దేవి రూపంలో దర్శనమిస్తారు. సింహ వాహనంపై, అభయవర ముద్రలతో కనిపిస్తారు. యోగశాస్త్రం ప్రకారం ఈమె ఆజ్ఞా చక్రానికి అధిష్ఠాన దేవత. అమ్మవారిని నేడు ‘కాత్యాయని మహామాయే| మహాయోగిన్యధీశ్వరి|| నంద గోప సుతం దేవిం| పతియే కురుతే నమ||’ మంత్రంతో ఉపాసిస్తే ఉత్తమ సంతానం, సౌభాగ్యం, కుటుంబ వృద్ధి, చతుర్విధ పురుషార్థ ఫలం సిద్ధిస్తుందని నమ్మకం.

Similar News

News February 12, 2026

అరవ శ్రీధర్ రావట్లేదా?.. అసెంబ్లీ లాబీలో చర్చ

image

AP: ఓ మహిళతో వివాహేతర సంబంధం ఆరోపణలు <<19038842>>ఎదుర్కొంటున్న<<>> రైల్వే కోడూరు జనసేన MLA అరవ శ్రీధర్‌ గురించే ఇవాళ అసెంబ్లీ లాబీలో ఎక్కువసేపు చర్చ సాగినట్లు తెలుస్తోంది. శ్రీధర్ అసెంబ్లీకి రావట్లేదా? అంటూ మిగతా ఎమ్మెల్యేలు చర్చించుకున్నారట. అయితే ఈ సెషన్ మొత్తానికి ఆయన్ను రావద్దని జనసేన అధిష్ఠానం ఆదేశించినట్లు సమాచారం. అటు బయట పార్టీ కార్యక్రమాల్లోనూ శ్రీధర్ కనిపించడం లేదు.

News February 12, 2026

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త హెల్త్ పాలసీ

image

TG: ప్రభుత్వ ⁠ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త హెల్త్ పాలసీ అమల్లోకి రానుంది. దీంతో ఎంప్యానెల్డ్ హాస్పిటల్స్‌లో పరిమితి లేని వైద్య సదుపాయాలు ఉంటాయి. ఉద్యోగులు, పెన్షనర్ల బేసిక్ పేలో 1.5%, సర్కార్ 1.5% కలిపి మొత్తం 3%(ఏటా సుమారు రూ.1000Cr) కేటాయించనుంది. పథకం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు, మోడల్ స్కూల్స్, గురుకులాల సిబ్బందినీ ఇందులోకి తీసుకొచ్చే అవకాశముంది. దీనికోసం కమిటీని ఏర్పాటు చేయనుంది.

News February 12, 2026

ఈ 3 ఆహారాలు.. ‘లివర్’ కిల్లర్స్

image

శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో <<19090434>>లివర్<<>> ఒకటి. దాన్ని ఈ 3 రకాల ఫుడ్స్ నాశనం చేస్తాయంటున్నారు వైద్యులు.
షుగర్ డ్రింక్స్: సోడాస్, ఫ్రూట్ జూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్.. లివర్‌కు విషం లాంటివి.
డీప్ ఫ్రైడ్ ఫుడ్: ఇలాంటి ఆహారం తింటే లివర్ సెల్స్ డ్యామేజీ అవుతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాపు పెరుగుతుంది.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్: చిప్స్, క్యాండీస్, హాట్ డాగ్స్, న్యూడుల్స్.. సీరియల్ కిల్లర్స్ లాంటివి.
#Shareit