News September 27, 2025

అసెంబ్లీలో బాలకృష్ణ వివాదంపై చంద్రబాబు రియాక్షన్!

image

AP: అసెంబ్లీలో <<17827034>>బాలకృష్ణ<<>>, కామినేని ఎపిసోడ్‌పై CM CBN అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అటు మంత్రులు టార్గెట్‌గా కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు సంధించడంపై సీరియస్ అయ్యారు. ఇదే విషయమై సుధీర్ రెడ్డి, బొండా, బూర్ల ఆంజనేయులుకు క్లాస్ ఇచ్చినట్లు సమాచారం. ఇదంతా జరుగుతున్నా TDP రాష్ట్రాధ్యక్షుడు పల్లా, విప్‌లు ఏం చేస్తున్నారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోసారి రిపీట్ కావొద్దని హెచ్చరించారు.

Similar News

News February 11, 2026

తమిళనాడులో సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటు: స్టాలిన్

image

త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాము సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని DMK అధినేత, సీఎం స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. 2021 కంటే ఎక్కువ స్థానాలను దక్కించుకుంటామని అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తుతో పోటీ చేస్తామని తెలిపారు. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీతో తనకు సోదర బంధం ఉందని పేర్కొన్నారు. అధికారాన్ని పంచుకోవడమనే ప్రశ్న ఇప్పుడు ముఖ్యం కాదన్నట్లుగా మాట్లాడారు.

News February 11, 2026

సల్మాన్ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం ఉంటుంది: ఏక్‌నాథ్ షిండే

image

RSS శతాబ్ది వేడుకలకు నటుడు సల్మాన్ ఖాన్ హాజరవడంపై వస్తున్న విమర్శలను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే తిప్పికొట్టారు. సల్మాన్ భారతీయ పౌరుడని, మన సంస్కృతిని గౌరవిస్తారని గుర్తుచేశారు. ఆయన ఇంట్లో వినాయకుడి విగ్రహం ఉంటుందని తెలిపారు. ఒక కార్యక్రమానికి హాజరైనంత మాత్రాన వివాదం చేయడం సరికాదన్నారు. ఆయన దేశభక్తిని, సంస్కృతిని గౌరవించే తత్వాన్ని చూడాలని సూచించారు.

News February 11, 2026

మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు

image

AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 7వ తేదీ వరకు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ(BAC) భేటీలో నిర్ణయించారు. 17 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 14న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 15న శివరాత్రి, తర్వాతి రోజు 16న, మార్చి 1, 2, 3 తేదీల్లో సెలవులు ఉండనున్నాయి. 17, 18 తేదీల్లో బడ్జెట్‌పై చర్చిస్తారు. అవసరమైతే సమావేశాలను పొడిగించాలని నిర్ణయించారు.