News April 6, 2024
ఆగస్టు తర్వాతే రెపో రేటులో కోతలు: సిద్ధార్థ సన్యాల్

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే విషయంలో ఆర్బీఐ నిర్ణయాలను బాగున్నాయని ఆర్థికవేత్త సిద్ధార్థ సన్యాల్ కొనియాడారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్నారు. ఆగస్టు తర్వాతే రెపో రేటు (ప్రస్తుత 6.5శాతం) కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో సీపీఐ ద్రవ్యోల్బణం 4శాతం తగ్గొచ్చని.. దీంతో రెపో రేటు 50-100 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చని అన్నారు.
Similar News
News April 23, 2025
ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: తాలిబన్లు

J&K ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ‘జమ్మూకశ్మీర్ పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాం. ఇలాంటి ఘటనలు దేశభద్రతను దెబ్బతీస్తాయి’ అని తాలిబన్ విదేశాంగ శాఖ పేర్కొంది. అటు ఈ ఉగ్రదాడులపై బంగ్లాదేశ్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.
News April 23, 2025
సిద్దరామయ్య, డీకేకు హత్య బెదిరింపులు

కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. వారిని హత్య చేస్తామని బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. వారిద్దరి డెడ్‌బాడీలను ముక్కలుముక్కలుగా నరికి బ్యాగులో కుక్కుతానని బెదిరించారు. ఈ మెయిల్స్ సింధార్ రాజ్‌పుత్ పేరిట వచ్చినట్లు విధానసౌధ పీఎస్ పోలీసులు గుర్తించారు. పోలీసులు FIR నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.
News April 23, 2025
సెల్యూట్: ఉగ్రవాదులతో పోరాడి.. వీర మరణం

పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారిలో సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఒక్కడే స్థానికుడు. గుర్రంపై పర్యాటకులను ఎక్కించుకుని పహల్గామ్ తీసుకెళ్తూ ఉంటాడు. అందరూ ప్రాణ భయంతో పరుగులు పెడుతుంటే.. హుస్సేన్ మాత్రం ప్రాణాలను లెక్కచేయకుండా ఎదురు తిరిగాడు. ఓ ఉగ్రవాది నుంచి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించగా కాల్చి చంపేశారు. తమ బిడ్డ మరణానికి దేశం ప్రతీకారం తీర్చుకోవాలని అతడి పేరెంట్స్ కోరుతున్నారు.