News April 6, 2024

నేడు రాజస్థాన్‌తో బెంగళూరు‌ ఢీ

image

IPLలో రాజస్థాన్, బెంగళూరు జట్ల మధ్య నేడు ఆసక్తికర పోరు జరగనుంది. ఆడిన 3మ్యాచుల్లోనూ RR టాప్2లో ఉంటే.. RCB 4మ్యాచుల్లో 1 మాత్రమే గెలిచి 8వ ప్లేస్‌లో ఉంది. వరుస ఓటములతో డీలాపడ్డ RCBకి ఈరోజు జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్‌ను దాని సొంతగడ్డపైనే ఎదుర్కోనుండటం సవాలే. వీటి మధ్య 30మ్యాచులు జరగ్గా.. RR 15, RCB 12 మ్యాచుల్లో గెలిచాయి. మూడింట్లో ఫలితం తేలలేదు.

Similar News

News February 2, 2026

ఖమ్మం పాలిటిక్స్.. పోలీసుల విలవిల

image

ఖమ్మం జిల్లాలో రాజకీయ పార్టీల ఆధిపత్య పోరు పోలీసులకు శాపంగా మారింది. BRS నిరసనలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్న వన్ టౌన్ సీఐ కరుణాకర్ చేయి విరగింది. సీఐపై దాడిని సీరియస్‌గా తీసుకున్న సీపీ సునీల్ దత్ అరుగురిపై కేసు నమోదు చేశారు. గతంలోనూ కొందరు అధికారులు సస్పెన్షన్లు, వీఆర్ఎస్‌లతో ఇబ్బందులు పడ్డారు. పార్టీల మధ్య నలిగిపోతూ విధులు నిర్వర్తించడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది.

News February 2, 2026

పీఎం కిసాన్ రూ.6వేలే.. పెంపు లేదు

image

దేశవ్యాప్తంగా పంట పెట్టుబడి సాయం కోసం కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ఏడాదికి రూ.6వేలు (3 విడతల్లో) ఇస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని రూ.8 వేలు లేదా రూ.10 వేలకు పెంచుతారని వార్తలు వచ్చాయి. అయితే బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా తెలంగాణలో ఈ స్కీమ్ ద్వారా 30 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.

News February 2, 2026

స్కిల్ కేసు నుంచి చంద్రబాబుకు పూర్తి ఊరట!

image

AP: చంద్రబాబు సీఎం అయ్యాక పలు కేసుల నుంచి ఉపశమనం లభిస్తోంది. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసు దాదాపుగా ముగిసినట్లేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని CID గతంలోనే పేర్కొంది. కేసు మూసేయాలని కోరడంతో గతనెల 12న కోర్టు ఆమోదించింది. ఈ కేసుతో ఆయనకు సంబంధంలేదని ED కూడా తేల్చేసింది. దీంతో ఆయనకు క్లీన్ చిట్ లభించినట్లు అయ్యింది.