News September 27, 2025
శ్రీకాకుళం జిల్లాకు తుఫాన్ అలెర్ట్

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 29 వరకు తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. భారత వాతావరణశాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి శనివారం ఒడిశా – ఉత్తరాంధ్ర మద్య తీరం దాటుతుందన్నారు. గ్రామ స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని, చెట్లు కింద ఉండరాదన్నారు.
Similar News
News September 27, 2025
వైసీపీ డిజిటల్ బుక్ లాంచింగ్ చేసిన తమ్మినేని

వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు డిజిటల్ బుక్ ప్రవేశపెట్టడం జరుగుతుందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డిజిటల్ బుక్ లాంచింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. వైసీపీ నాయకులపై చేస్తున్న అక్రమాలపై బుక్‌లో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని వివరించారు.
News September 27, 2025
శ్రీకాకుళంలో మీకిష్టమైన పర్యాటక ప్రదేశం ఏది ?

శ్రీకాకుళం జిల్లాలో పలు పర్యాటక ప్రదేశాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సుదీర్ఘ సముద్ర తీరం, నదీ పరీవాహక ప్రాంతాలు, ఎత్తైన కొండలు, పలు జలపాతాలు, విస్తారమైన వివిధ రకాల తోటలు, విదేశీ పక్షుల విడిది కేంద్రాలు, ఆధ్యాత్మిక ప్రాంతాల కలబోత మన శ్రీకాకుళం జిల్లా. ప్రభుత్వం దృష్టి సారిస్తే అనేక పర్యాటక ప్రదేశాలు నిత్యం కళకళలాడుతూ ఉంటాయి. మరి మీకు ఇష్టమైన పర్యాటక ప్రదేశం ఏది ? కామెంట్ చేయండి.
News September 27, 2025
విశాఖలో పర్యాటక ప్రదేశాలకు ఉచిత ప్రవేశం

VMRDA ఆధ్వర్యంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు శనివారం ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. VMRDA పార్క్, కైలాసగిరి, సెంట్రల్ పార్క్, తెలుగు మ్యూజియం, సబ్ మెరైన్ మ్యూజియం, TU-142 ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం, సీ- హారియర్ మ్యూజియం, UH3H హెలికాప్టర్ మ్యూజియంలో ఉచితం ప్రవేశం కలదు.