News April 6, 2024
ఖమ్మం: ముగిసిన ఇంటర్ వాల్యుయేషన్
ఖమ్మం: ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం శుక్రవారంతో ముగిసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 2,75,139 జవాబు పత్రాలను జిల్లాకు పంపించగా నెల 4వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభించారు. ప్రతీ అధ్యాపకుడు రోజుకు 30 చొప్పున జవాబు పత్రాలను దిద్దగా , శుక్రవారంతో వాల్యూయేషన్ పూర్తయిందని డీఐఈఓ కె.రవిబాబు తెలిపారు.
Similar News
News January 1, 2025
జిల్లా ప్రజలకు మంత్రి పొంగులేటి నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఖమ్మం జిల్లా ప్రజలకు రెవెన్యూ, గృహ, నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. కొత్త ఏడాది, ఆశలు, కోరికలు, లక్ష్యాలు, ఆశయాలు, నిర్ణయాలు, ఉత్సాహంతో కలకాలం ఉండాలని కోరారు. ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులతో విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో ఇంటింటా ఆనందాలు కలగాలని చెప్పారు.
News December 31, 2024
ఖమ్మం: మైనార్టీ అభ్యర్థులకు గుడ్ న్యూస్
తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా జిల్లాలో గ్రూప్ 1, 2, 3, 4 పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ కల్పించనుంది. పైన పేర్కొన్న పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి నాలుగు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మైనార్టీ శాఖ జిల్లా అధికారి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 10వ తేదీ లోపు కార్యాలయంలో తగిన ధ్రువపత్రాలతో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
News December 31, 2024
ఎటపాక: బాలుడిని నరికి చంపిన వ్యక్తి
ఎటపాక మండలం మద్ది గూడెంకు కనితి నాగరాజ్ అనే బాలుడిని అదే గ్రామానికి చెందిన ముర్రు కోటేశ్వరరావు సోమవారం గొడ్డలితో నరికి చంపాడు. మద్ది గూడెం అటవీ ప్రాంతం కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కోటేశ్వరరావు మానసిక రోగిలా మారి తిరుగుతున్నాడని గ్రామస్థులు చెప్పారు. పొలానికి వెళ్లిన కనితి నాగరాజ్‌ను గొడ్డలితో నరికి పారిపోయాడన్నారు. ఎటపాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.