News September 27, 2025

OFFICIAL: దేవర-2కు సిద్ధంకండి!

image

జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టిన విషయం తెలిసిందే. సినిమా ఎండ్ కార్డ్స్‌లో సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. కానీ తర్వాత ఎప్పుడూ ఆ ప్రస్తావన రాలేదు. తాజాగా దేవర చిత్రం విడుదలై ఏడాది పూర్తైన సందర్భంగా NTR ఆర్ట్స్ సీక్వెల్‌పై స్పందించింది. ‘దేవర తాండవానికి ఏడాది పూర్తైంది. దేవర 2 కోసం సిద్ధంకండి’ అని ట్వీట్ చేసింది.

Similar News

News February 10, 2026

దీనస్థితిలో ఉన్నానంటూ సీనియర్ నటుడి ఆవేదన

image

తాను దీనస్థితిలో ఉన్నానని బాలీవుడ్ సీనియర్ నటుడు రాజ్‌పాల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ HC గతవారం తీహార్ జైలు అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో జైలుకెళ్లే ముందు ఓ ఇంటర్వ్యూలో ‘కష్టాల్లో ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇండస్ట్రీలో ఎవరి లైఫ్ వారిదే’ అని వాపోయారు. ‘అతా పతా లాపతా’ మూవీతో డైరెక్టర్‌గా మారేందుకు ఆయన ఓ వ్యాపారి వద్ద ₹5Cr అప్పుచేసి తిరిగివ్వలేదు.

News February 10, 2026

బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారి హత్య

image

బంగ్లాదేశ్‌లో మైనార్టీల హత్యలు కొనసాగుతున్నాయి. మిమెన్‌సింగ్ జిల్లాలో హిందూ వ్యాపారి సుసేన్ చంద్ర సర్కార్‌ను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. దక్షిణకందా గ్రామానికి చెందిన సర్కార్ దగ్గరలోని బోగర్ బజార్‌లో బియ్యం వ్యాపారం చేస్తున్నారు. హత్య తర్వాత షాపులో నుంచి లక్షల రూపాయలను దొంగిలించినట్టు పోలీసులు తెలిపారు. రెండు రోజుల్లో జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా హత్య కలకలం రేపుతోంది.

News February 10, 2026

రంజాన్ మాసం.. ముస్లిం ఉద్యోగులకు గుడ్ న్యూస్

image

AP: రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉపవాసాల నేపథ్యంలో ఒక గంట ముందే ఇంటికి వెళ్లేందుకు అనుమతించింది. ఈనెల 18 నుంచి మార్చి 19 వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ ఉద్యోగులు డ్యూటీ నుంచి ఒక గంట ముందే ఇంటికి వెళ్లొచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.