News September 27, 2025

ఈ హెయిర్ ‌స్టైల్స్‌తో హెయిర్‌ఫాల్

image

కొన్నిరకాల హెయిర్‌స్టైల్స్‌తో కుదుళ్లకు రక్తప్రసరణ తగ్గి హెయిర్‌ఫాల్ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోనీటెయిల్స్, కార్న్‌రోస్, బన్స్, హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ అలోపేషియాకు కారణమవుతాయని అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ పేర్కొంది. గట్టిగా బిగిస్తే కుదుళ్లు బలహీనమై జుట్టు ఊడిపోతుందని చెబుతున్నారు. కాబట్టి జుట్టుకు హాని కలిగించని హెయిర్​స్టైల్స్​ ప్రయత్నించాలని సూచించారు.

Similar News

News February 20, 2026

ఇరాన్-US యుద్ధం వస్తే భారత్‌పై ప్రభావమెంత?

image

ఇరాన్‌పై యుద్ధం జరిగితే భారతదేశ ఇంధన భద్రత, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. భారత్ తన ఇంధన అవసరాల కోసం 85% దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఆయిల్ ధరలను అమాంతం పెంచేస్తాయి. చమురు ధరలు 10% పెరిగితే మన దేశ GDP 0.3% తగ్గి, ద్రవ్యోల్బణం 0.4% పెరుగుతుంది. షిప్పింగ్ ఛార్జీలు 50% వరకు పెరుగుతాయి. ఫలితంగా రూపాయి విలువ పడిపోయి బంగారం ధరలకు రెక్కలొస్తాయి.

News February 20, 2026

‘చేతకాకుంటే చెప్పండి’.. పోలీసుల తీరుపై సుప్రీం ఫైర్

image

AP: MLC అనంతబాబు డ్రైవర్ హత్యకేసులో పోలీసుల తీరుపై SC ఆగ్రహం వ్యక్తం చేసింది. వారికి చేతకాకుంటే CBIకి అప్పగిస్తామని స్పష్టం చేసింది. దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ సాగదీస్తున్నారని మండిపడింది. అభియోగాలపై ఏప్రిల్ 18లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. నవంబర్ 30లోపు ట్రయల్ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. అప్పటివరకు అనంతబాబు బెయిల్‌ను పొడిగిస్తున్నట్లు పేర్కొంది.

News February 20, 2026

బెండలో నీటి యాజమాన్యం, కలుపు నివారణ

image

బెండ విత్తనాలు విత్తిన వెంటనే నీరు పెట్టాలి. నల్లరేగడి నేలల్లో అయితే ప్రతి ఐదారు రోజులకు నీరు అందించాలి. పూత, కాయ దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. నీటి లభ్యత బాగా తక్కువగా ఉంటే బిందుసేద్యం విధానం అనుసరించడం మంచిది. పంటకాలంలో 3 నుంచి నాలుగుసార్లు కలుపు తీయాల్సి ఉంటుంది. విత్తనాలు వేసిన 2 వారాలకు కలుపు నియంత్రణ చర్యలు చేపట్టాలి. తర్వాత సమస్యను బట్టి కలుపును తొలగించుకోవాలి.